Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాహుబలి గొడవ: రాజమౌళి కామెంట్లకు షాకయ్యా, బాధేసిందన్న శ్రీదేవి
రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు బాధేసిందని శ్రీదేవి అన్నారు. పబ్లిగ్గా తన గురించి అలాంటి కామెంట్స్ చేయడం సరికాదన్నారు.
హైదరాబాద్: ఏదైనా సినిమా ఒప్పుకోవాలా? వద్దా? అనేది ఆయా నటీనటుల ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కథ నచ్చక పోయినా, పాత్ర నచ్చక పోయినా, లేదా వారికి ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ నచ్చక పోయినా.... తిరస్కరించడం వారి హక్కు. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వ సాధారణం. ఇవన్నీ అంతర్గత విషయాలు.
దర్శక నిర్మాతలు కూడా.... ఎవరైనా హీరో లేదా హీరోయిన్‌ను సంప్రదించినపుడు జరిగిన ఈ అంతర్గత విషయాలను బయట పెట్టరు... పెట్టకూడదు కూడా. మరి రాజమౌళి ఈ విషయం మరిచిపోయారో? లేక బాహుబలి భారీ విజయం సాధించిందన్న ఆనందంలో టంగ్ స్లిప్పయ్యారో ఏమో? తెలియదు కానీ....ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి బాహుబలి ఆఫర్ ఎందుకు రిజక్ట్ చేసిందనే విషయాలు బయట పెట్టేశారు. అంతే కాకుండా ఆమె ఉంటే సినిమా పోయేది అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు.
రాజమౌళి ఆ కామెంట్స్ చేసిన పరిస్థితి కాస్త వివాదాస్పదంగా మారింది. శ్రీదేవి ఎప్పుడు ఎదురవుతుందా? ఈ విషయాల గురించి ఎప్పుడు అడుగుదామా? అని మీడియా వారు కాచుకుని కూర్చున్నారు. తాజాగా తన 'మామ్' మూవీ ప్రమోషన్లలో భాగంగా శ్రీదేవి 'బాహుబలి' విషయంలో తనపై రాజమౌళి చేసిన కామెంట్లపై స్పందించారు.
రాజమౌళి కామెంట్లకు బాధేసింది
తన వెల్ విషెర్స్ రాజమౌళి తన గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లింక్ ను పంపితే దాన్ని చూసి షాక్ అయ్యానని, ఎంతో బాధపడ్డానని శ్రీదేవి తాజాగా ఓ తెలుగు టీవీ చానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
అది సరైన పద్దతి కాదు
రాజమౌళి అంటే తనకెంతో గౌరవమని, ఆయన దర్శకత్వం వహించిన 'ఈగ' చిత్రం అద్భుతమని చెప్పిన శ్రీదేవి.... అలాంటి దర్శకుడు తన గురించి అలా మాట్లాడటం పద్దతిగా అనిపించలేదని, మనసుకు బాధ కలిగించిందని చెప్పారు. పబ్లిక్ ప్లాట్ ఫాంపై చెప్పడం, ఇలా మాట్లాడటం మంచి పద్ధతి అనిపించుకోదు అన్నారు.
ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు
రాజమౌళికి తన గురించి నిర్మాతలు తప్పుగా చెప్పి ఉంటారేమోనని శ్రీదేవి అభిప్రాయ పడ్డారు. అలాంటి గొంతెమ్మ కోరికలు కోరి ఉంటే 300 సినిమాలు చేసేదాన్ని కాదు, 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు అని ఆమె అన్నారు.
నిర్మాతలే తప్పుగా చెప్పారా?
రాఘవేంద్ర రావు, అశ్వనీదత్ వంటి వారెందరో తమ సినిమాల్లో రిపీటెడ్ అవకాశాలు ఇచ్చారు. అలాంటి నా గురించి రాజమౌళి లాంటి వారు ఇటు వంటివి విన్నప్పుడు యూ ఫీల్ బ్యాడ్. ఎందుకు ఇలా చెప్పాలి? ఒకవేళ ప్రొడ్యూసర్లు రాజమౌళి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పుంటారా? అన్న అనుమానాలు ఉన్నాయి.... అని శ్రీదేవి తెలిపారు.
రాజమౌళి ఇంకా మంచి సినిమాలు తీయాలి
రాజమౌళి చాలా కామ్, డిగ్నిఫైడ్ దర్శకుడని అనుకున్నా. బాహుబలి లాంటి సినిమా తీసినందుకు రాజమౌళిని అభినందిస్తున్నానని, ఆయన ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నానని అన్నారు శ్రీదేవి.
రాజమౌళి అప్పట్లో..
శివగామి పాత్ర చేయాలని శ్రీదేవి గారిని స్పందించిపుడు ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని, రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు ఆమె షూటింగుకు వచ్చిన ప్రతిసారి 5 బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టిక్కెట్లు, బిగ్గెస్ట్ హోటల్‌లో 5 సూట్లు... ఏర్పాట్లు చేయాలని ఆమె కోరినట్లు రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే.