» 

డబ్బింగులో శ్రీహరి ‘బకరా’

Posted by:
 

హైదరాబాద్: రియల్ స్టార్ శ్రీహరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకరా'. సి.ఎస్.ఆర్.కృష్ణన్ దర్శకత్వంలో సి.శివరామకృష్ణ, కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సి.ఎస్.ఆర్.కృష్ణన్ మాట్లాడుతూ నిత్యం మనిషి ఏదోచోట మోసపోయి బకరాగా మారుతున్నాడని, అదే కథాంశంతో థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, శ్రీహరి మాఫియా డాన్‌గా ఈ చిత్రంలో సరికొత్త విలనీయాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు.

సామాన్యులే నేటి సమాజంలో బకరాలుగా మారుతున్నారని, హైదరాబాద్ నవాబ్స్ తరహాలో ఈ కథ ప్రస్తుత సమాజానికి అద్దంపడుతూ సాగుతుందని , నవంబర్‌ 2వ వారంలో ఆడియో విడుదల చేసి, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.

ఈచిత్రంలో ఇంకా బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, కళ్లు కృష్ణారావు, నవీన్, ప్రవీణ్, పవన్, ఒంగోలు వెంకట్రావ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రోహిత్ కులకర్ణి, పాటలు: రామజోగయ్యశాస్ర్తీ, కెమెరా: సి.విజయశ్రీ, ఎడిటింగ్: రుద్రారెడ్డి, నిర్మాతలు: సి.శివరామకృష్ణ, కోటేశ్వరరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సి.ఎస్.ఆర్.కృష్ణన్.

Read more about: srihari, bakara, శ్రీహరి, బకరా
English summary
Srihari starrer 'Bakara' in dubbing stage. CSR krishna directing and producing the movie. Naveen, Pradeep, Yashiki in other roles.
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos