» 

రియల్ స్టార్ శ్రీహరి ‘బకరా’

Posted by:

హైదరాబాద్: రియల్ స్టార్ శ్రీహరి ప్రధాన పాత్రలో 'బకరా' మూవీ మొదలైంది. శ్రీహరి, నవీన్, ప్రదీప్, యాషిక నటీనటులుగా సి.ఎస్.ఆర్ కృష్ణ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం సోమవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుకుంది. ప్రముఖ నిర్మాత రామానాయుడు తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా, మల్టీడైమన్షల్ రామ్మోహన్ రావు కెమెరా స్విచ్ఛాన్ చేసారు.

సినిమా గురించి దర్శకుడు వివరిస్తూ...నిత్య జీవితంలో ఎవరో ఒకరు, ఏదో ఒక కారణం చేత మోసపోతున్నారనే అంశాన్ని తీసుకుని ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శ్రీహరి నెగెటివ్ మాఫియా డాన్ క్యారెక్టర్ చేస్తున్నాం. థ్రిల్లింగ్ అండ్ ఫ్యామిలీ ఎటర్ టైన్మెంట్ గా ఉంటుంది. అక్టోబర్ నుంచి మొదటి షెడ్యూల్ ప్రారంభిస్తాము' అన్నారు.

శ్రీహరి మాట్లాడుతూ...ఈ సినిమా కథతో పాటు టైటిల్ నాకు బాగా నచ్చింది. హైదరాబాద్ నవాబ్ చిత్రం రేంజిలో విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రం ద్వారా కొత్తగా పరిచయం అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ చిత్రం మంచి పేరు తెస్తుందని అన్నారు.

ఈచిత్రంలో ఇంకా బ్రహ్మానందం, కొండవలస, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్త్రి, సి.ఎస్.ఆర్ కృష్ణ, సంగీతం: రోహిత్ కులకర్ణి, ఎడిటింగ్: రుద్రరెడ్డి, ఫోటోగ్రఫీ: విజయశ్రీ, సహ నిర్మాత: ఎ.కోటే్శ్వరరావు, కథ-మాటలు-స్ర్ర్కీన్ ప్లే-దర్శకత్వం: సి.ఎస్.ఆర్ కృష్ణ

Read more about: srihari, bakara, శ్రీహరి, బకరా
English summary
Srihari'S new movie Bakara launched today at Ramanaidu studio. CSR krishna directing and producing the movie. Naveen, Pradeep, Yashiki in other roles.
Please Wait while comments are loading...