» 

పగతో రగిలిపోతున్న శ్రీకాంత్

Posted by:

వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న శ్రీకాంత్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. సముద్ర దర్సకత్వంలో ఈ కొత్త చిత్రం రూపొందనుంది. ఎల్‌.వి.ఆర్‌.ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ పగతో రగిలిపోయే ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని చెప్తున్నారు. జినాల్‌ పాండే హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. పగతో రగిలిపోయే ఓ యువకుడి కథ ఇది. అంతర్లీనంగా హిందూ ధర్మం గొప్పతనాన్ని చెబుతున్నాం. శ్రీకాంత్‌ నటన అన్ని వర్గాల్నీ ఆకట్టుకొనేలా ఉంటుందని అన్నారు.

ఈ చిత్రంలో జీవా, నాగినీడు, చిట్టి, రఘు, కాదంబరి కిరణ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'కార్తీకమాసంలో మా సినిమాని లాంఛనంగా ప్రారంభించాం. ఈ నెల 30 వరకూ తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. రెండో షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లోనే జరుగుతుంది. మూడో షెడ్యూల్ బెంగుళూరు, వైజాగ్, నాలుగో షెడ్యూల్ విదేశాల్లో జరుగుతాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ చివరిలో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు. శ్రీకాంత్ సరసన జినాల్ పాండే అనే కొత్త హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో చిట్టి, ముక్తార్, రఘు, సత్య, ఆజాద్, ప్రభాకర్, జీవా, నాగినీడు, భాస్కర్, ఫిష్ వెంకట్, ఆనందభారతి, సత్యదేవ్, రజని, ల్యాబ్ శరత్, వెంకట్, కాదంబరి కిరణ్ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి కథ, మాటలు: స్వామిజీ విజయ్, ఫొటోగ్రఫీ: పి.ఎస్.బాబు, సంగీతం: శ్రీకాంత్ దేవా, ఎడిటింగ్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మేక రమణారావు, లైన్ ప్రొడ్యూసర్: డి.ఎస్.ఆర్., నిర్మాణసారథ్యం: తారకరామా ఫిలిమ్స్, నిర్మాత: లగడపాటి శ్రీనివాసరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.

Read more about: srikanth, samudra, virodhi, శ్రీకాంత్, సముద్ర, విరోధి
English summary
Srikanth's new movie under Samudra direction regular shoot will commence from December 21.

Telugu Photos

Go to : More Photos