» 

ప్లాపుల భయంతో పవన్ రూటులోకి శ్రీకాంత్

Posted by:

Srikanth
వరసగా తను నటిస్తున్న సినిమాలన్ని ఫ్లాప్ అవటంతో శ్రీకాంత్ ఓ నిర్ణయం తీసుకున్నారు.పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న రీమేక్ ల రూట్ లోకి రావాలని ప్లాన్ చేసాడు.అందులో భాగంగానే శ్రీకాంత్ .. ఇటీవల మలయాళంలో హిట్టయిన 'సీనియర్స్' చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఇది మల్టీ స్టారర్ చిత్రం. ఇందులో శ్రీకాంత్ తో బాటు మరికొందరు హీరోలు కూడా నటిస్తారు. ప్రస్తుతం వారి ఎంపిక జరుగుతోంది.

ఈ చిత్రం బాధ్యతలను ఓ యువ దర్శకుని చేతిలో పెడుతున్నట్లు సమాచారం. ఇక ఈ చత్రాన్ని తన తమ్ముడు మేకా అనీల్ నిర్మించనున్నారు. ఇక తాజాగా శ్రీకాంత్ హీరోగా చేసిన 'విరోధి' సినిమా డిజాస్టర్ అయింది.దాంతో ఆయన ఇలా ఫిక్స్ అయ్యారు. ఇక పవన్ కల్యాణ్ ఇంతకుముందే లవ్ ఆజ్ కల్ చిత్రాన్ని తీన్ మార్ పేరుతో రీమేక్ చేసారు.ఇప్పుడు దబాంగ్ చిత్రాన్ని గబ్బర్ సింగ్ టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు.

Read more about: srikanth, seniors, virodhi, శ్రీకాంత్, సీనియర్స్, విరోధి
English summary
Srikanth is all set to act in the Telugu remake version of the Malayalam super hit film Seniors. Srikanth’s brother Anil Meka has bagged the remake rights of the Seniors film. Hе will produce the film on hіѕ Meka Entertainment banner.
Please Wait while comments are loading...