»   » ‘శ్రీమంతుడు’ 100 డేస్ సెలబ్రేషన్స్ (ఫోటోస్)

‘శ్రీమంతుడు’ 100 డేస్ సెలబ్రేషన్స్ (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

రాజమండ్రి: సూపర్ స్టార్ మహేష్ నటించిన శ్రీమంతుడు 100 రోజులు సందర్భంగా రాజముండ్రి లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అభిమానులు తనుజ్ ఆధ్వర్యం లో జియోన్ అంధుల పాఠశాలా లో అన్నదానం నిర్వహించి శ్యామల థియేటర్ లో 666 ఛానల్ M.D.పంతం కొండల రావు, మేనేజర్ గుండు శీను చేతుల మీదుగా మూగ, చెవిటి విద్యార్ధులకు యూనిఫాంలను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుమార్ రాజ, కర్నూల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్ సంధ్య 35MM లో అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన శ్రీమంతుడు 100 రోజులు సందర్భంగా థియేటర్ నిర్వహనాధికారి రామ కృష్ణ కేకు కట్ చేయగా, గజ మలతో సత్కరించి షీల్డ్ అందజేసారు . ఈ కార్యక్రమం లో మహమ్మద్ జానీ, జవహర్, మల్లికార్జున్ , అరవింద్,సంపత్,తదితర అభిమానులు పాల్గొన్నారు.


Srimanthudu 100 days celebrations

శ్రీమంతుడు సైకిల్ కాంటెస్ట్...
శ్రీమంతుడు సైకిల్ కాంటెస్టు నిర్వహించి ఇటీవలే విజేతకు సైకిల్ అందజేసిన సంగతి తెలిసిందే. ఈ కాంటెస్టు ద్వారా సమకూరిన మొత్తాన్ని శ్రీమంతుడు టీం సేవా కార్యక్రమాలకు వినియోగించారు. అందులో బాలయ్య చైర్మన్‌గా కొనసాగుతున్న ‘బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి' రూ. 5 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబు భార్య నమ్రత శిరోర్కర్, నిర్మాతలు స్వయంగా ఆసుపత్రి ప్రతినిధులుకు చెక్కు అందజేసారు.


Srimanthudu 100 days celebrations

దీంతో పాటు హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్ కోసం రూ. 10 లక్షల విరాళం అందించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులకు శ్రీమంతుడు టీం, మహేష్ బాబు సతీమణి నమ్రత చెక్కు అందజేసారు. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ శ్రీమంతుడు కాంటెస్టులో పాల్గొన్న వారికి నా తరుపున, మహేష్ బాబు తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సినిమాకు వచ్చిన స్పందన చూస్తుంటే ఈ తరహా మంచి చిత్రాలు చేయాలనే కుతూహలం మరింత పెరుగుతోంది అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

English summary
Check out photos of Srimanthudu 100 days celebrations in sandhya 35, Rajamundry town.
Please Wait while comments are loading...