twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీమంతుడు.....రామ్ చరణో, ఎన్టీఆరో వదిలేసిన కథ కాదు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు' సినిమా ఆగస్టు 7న విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు. జులై 17న సినిమా విడుదల కావాల్సి ఉండగా ‘బాహుబలి' నిర్మాతల రిక్వెస్ట్ మేరకు ఈ సినిమాను వాయిదా వేసారు.

    ఇటీవల మీడియా సమావేశంలో ‘శ్రీమంతుడు' సినిమాపై నెలకొన్న పలు అనుమాలను దర్శకుడు కొరటాల శివ నివృత్తి చేసారు. ఆ మధ్య రామ్ చరణ్-కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉండగా పలుకారణాలతో రద్దయింది. దీంతో కొరటాల శివ అదే కథతో మహేస్ బాబుతో ‘శ్రీమంతుడు' సినిమా తీసారనే వార్త ప్రచారంలో ఉంది. గతంలో ఈ స్టోరీ జూ ఎన్టీఆర్ రిజెక్టు చేసినట్లు కూడా పుకార్లు ఉన్నాయి.

    ఈ వార్తలపై కొరటాల శివ స్పందిస్తూ... ఈ స్టోరీ ప్రత్యేకంగా మహేష్ బాబు కోసం తయారు చేసిన స్టోరీ. రామ్ చరణ్ తో చేయాలనుకున్న స్టోరీ ఇది కాదు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు' అని కొరటాల శివ స్పష్టం చేసారు. ‘శ్రీమంతుడు' సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టెనర్. మహేష్ బాబు యాక్టింగ్ స్కిల్స్ అద్భుతం అంటూ దర్శకుడు ప్రశంసించాడు.

    Srimanthudu Is Neither Ram Charan's Nor NTR's

    ఆగష్టు 7న ‘శ్రీమంతుడు' సినిమాని రిలీజ్ చెయ్యడానికి డేట్ ని లాక్ చేసారు. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగష్టు 9. అంటే పుట్టిన రోజుకు రెండు రోజులు ముందుగానే కానుక వచ్చేస్తుందన్నమాట. అలాగే ఆడియోని జూలై 18న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం అధికారికంగా తెలియజేసింది.

    ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. జూన్ 27కి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయనున్నారు. దానికోసమే అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరోప్రక్క ‘శ్రీమంతుడు' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మరో ప్రక్క ఈ చిత్రం ఆడియో విడుదల కోసం సైతం ఫ్యాన్స్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో సాంగ్ లీకైందనే వార్త అందరినీ కలవరపరిచింది.

    అయితే ఈ విషయమై ఈ చిత్రం నిర్మాతలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. వారు పోస్ట్ చేస్తూ... శ్రీమంతుడు పాట లీకైందని తెలిసింది.అయితే మా సినిమాలో ది మాత్రం కాదన్నారు. మరో ప్రక్క తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తానికి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

    English summary
    "The story I've prepared for Mahesh Babu garu's Srimanthudu is different from the film I'm supposed to work wtih Charan garu. That film and this film are total contrast to each other. There is no truth in rumors that I've narrated same story to Mahesh and got approved", Koratala Siva clarified.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X