twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య బసవతారకం ఆసుపత్రికి ‘శ్రీమంతుడి’ విరాళం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శ్రీమంతుడు సైకిల్ కాంటెస్టు నిర్వహించి ఇటీవలే విజేతకు సైకిల్ అందజేసిన సంగతి తెలిసిందే. ఈ కాంటెస్టు ద్వారా సమకూరిన మొత్తాన్ని శ్రీమంతుడు టీం సేవా కార్యక్రమాలకు వినియోగించారు. అందులో బాలయ్య చైర్మన్‌గా కొనసాగుతున్న ‘బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి' రూ. 5 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబు భార్య నమ్రత శిరోర్కర్, నిర్మాతలు స్వయంగా ఆసుపత్రి ప్రతినిధులుకు చెక్కు అందజేసారు.

    Srimanthudu team donates to Basavatarakam Cancer Hospital

    దీంతో పాటు హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్ కోసం రూ. 10 లక్షల విరాళం అందించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులకు శ్రీమంతుడు టీం, మహేష్ బాబు సతీమణి నమ్రత చెక్కు అందజేసారు. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ శ్రీమంతుడు కాంటెస్టులో పాల్గొన్న వారికి నా తరుపున, మహేష్ బాబు తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సినిమాకు వచ్చిన స్పందన చూస్తుంటే ఈ తరహా మంచి చిత్రాలు చేయాలనే కుతూహలం మరింత పెరుగుతోంది అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

    Srimanthudu team donates to Basavatarakam Cancer Hospital

    ‘శ్రీమంతుడు’ కాంటెస్టులో మొత్తం 2200 మంది అభిమానులు పాల్గొన్నారు. కాంటెస్టులో పాల్గొన్న వారికి టీషర్టులు ఇతరత్రా గిఫ్టులు పంపిస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్ తెలిపారు. కాంటెస్టు ద్వారా దాదాపు 22 లక్షలు సమకూరినట్లు సమాచారం. ఇందులో కాంటెస్టు నిర్వహణ ఖర్చులు, పాల్గొన్న వారికి టీషర్టులు కోసం 7 లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది.

    Namrata's Emotional Speech

    Thank you super fans for the response!! We hope to make better films like this - Namrata

    Posted by PrinceMahesh.com on Wednesday, November 18, 2015

    'శ్రీమంతుడు' మూవీ ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా మంచి లాభాలు గడించడంతో అందులో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. గతంలోనూ అనేక సందర్భాల్లో మహేష్ బాబు తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు డొనేట్ చేసారు.

    English summary
    Check out photos of Srimanthudu team donates to Basavatarakam Cancer Hospital and Heal A Child Foundation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X