twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి గురించి శ్రీను వైట్ల అఫీషియల్‌గా ప్రకటించారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తోరకెక్కుతోన్న సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ చేస్తున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల అఫీషియల్ గా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రామ్ చరణ్ తో నేను చేస్తున్న సినిమాలో చిరంజీవిగారు కూడా భాగమయ్యారు అని ప్రకటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఇతర వివరాలు ప్రకటిస్తాం అంటూ ట్వీట్ చేసారు.

    సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే...
    రామ్ చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా క్లైమాక్స్ ని చిత్రీకరించినట్లు సమాచారం. ఈ క్లైమాక్స్ కోసం నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు చెప్పుకుంటున్నారు. క్లైమాక్స్ కోసం తెలుగు సినిమాలో నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. దాంతో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

    క్లైమాక్స్ సీన్ పై అంత ఖర్చు పెట్టడాన్ని నిర్మాతని,దర్శకుడుని కొందరు అడిగితే ఇది రామ్ చరణ్ సినిమాలో క్లైమాక్స్ అందుకే అంత ఖర్చు పెడుతున్నాం. పెట్టినదానికి రెండింతలు వస్తుందని ధీమాగా చెప్పినట్లు తెలుస్తోంది.

    Srinu Vaitla confirms Chiru’s cameo

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్ర టీం బ్యాంకాక్ లోనూ, స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో రెండు పాటల షూటింగ్ ని పూర్తి చేసుకొని వచ్చారు. ఇప్పుడు టీజర్ ని రెడీ చేసి విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదలయ్యే ఈ టీజర్ ని ఇప్పటికే చూసిన తమన్ ఈ విషయాన్నిచాలా ఎక్సైటింగ్ గా ట్వీట్ చేసారు.

    ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేయాల్సి ఉంటుందట. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    "Honoured to announce that Megastar Chiranjeevi Garu is going to be a part of #RC9.Title and details coming soon." Sreenu Vaitla said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X