»   » అల్లు అర్జున్ వార్నింగ్.. స్టైలిష్ స్టార్ కోపానికి కారణమిదే..

అల్లు అర్జున్ వార్నింగ్.. స్టైలిష్ స్టార్ కోపానికి కారణమిదే..

ఎప్పుడూ జోవియల్ గా ఉండే అల్లు అర్జున్ కు దువ్వాడ జగన్నాథమ్ సెట్లో కోపం వచ్చింది. అందుకు కారణమైన మోడల్స్ కు వార్నింగ్ ఇచ్చారని టాక్.

Posted by:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ కార్యక్రమంలో ఉంటే. అక్కడ ఉంటే సందడే సందడి. ఆయా కార్యక్రమాలకు హాజరైయ్యే వారికి కూడ జోష్ ఉండేలా అల్లు అర్జున్ సరదా వ్యవహరిస్తారని చెప్పుకొంటారు. అలా జోవియల్ గా ఉండే అల్లు అర్జున్ కు దువ్వాడ జగన్నాథమ్ సెట్లో కోపం వచ్చింది. ఆ కోపానికి కారణమైన సుందరాంగులకు వార్నింగ్ ఇచ్చారట.

దువ్వాడ జగన్నాథమ్ సినిమా కోసం ఇటీవల సంగీత్ సీన్ షూట్ చేస్తున్నారట. అందుకోసం భారీగా మోడల్స్ ను పిలిపించారట. షూటింగ్ సందర్భంగా సంగీత్ కార్యక్రమం కోసం వేసిన సెట్ లో సుందరాంగులు సెల్ఫీలతో హంగామా సృష్టించారట. అంతేకాకుండా బన్నీతో సెల్పీలకు ఎగబడ్డారట. దాంతో కోపగించుకొన్న ఆయన 'సంగీత్ సెట్ చిత్రాలు లీక్ కావడం నాకు ఇష్టం లేదు.

Stylish Star Allu Arjun serious over Models in Duvvada Jagannadham sets.

నా గెటప్ బయటకు వెళ్లవద్దు. సెట్ లో ఎవరూ కూడా సెల్ఫీలు తీసుకోవద్దు' అని హెచ్చరించాడట. దాంతో అక్కడ వాతావరణం గంభీరంగా మారిపోయిందట.

English summary
Allu Arjun serious over Models in Duvvada Jagannadham sets. he objected taking selfies in set of the movie
Please Wait while comments are loading...