»   » సుధీర్ బాబు మూవీ లాంచ్: కృష్ణ కూతుర్ల సందడి (ఫోటోస్)

సుధీర్ బాబు మూవీ లాంచ్: కృష్ణ కూతుర్ల సందడి (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదాబాద్: సుధీర్ బాబు హీరోగా నూతన నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఈ నెల 5న పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా, వామికా గబ్బి కథానాయికగా పరిచయమవుతున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఆకర్షణ ఏమిటంటే సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెలంతా హాజరవడం.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద కుమార్తె పద్మ గౌరవ దర్శకత్వం వహించగా, రెండె కుమార్తె మంజుల క్లాప్ కొట్టారు. మూడో కుమార్తె ప్రియ దర్శిని కెమెరా స్విచాన్ చేసారు. సంజయ్ స్వరూప్ స్క్రిప్టు అందించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కుటుంబ సభ్యులు యూనిట్ మెంబర్స్ కి శుభాకాంక్షలు తెలిపారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ..

‘సినిమా కొత్తగా, ఊహించని మలుపులతో, ఆసక్తికరంగా ఉంటూనే వినోదాన్ని పంచే కథ ఇది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీసిన లఘు చిత్రాలు చూసి తను ఓ సినిమా బాగా తీయగలడని నమ్మకం ఏర్పడింది. విశ్వరూపం-2, ఉత్తమ విలన్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ ఈ చసినిమాకు పని చేస్తుండటం అదనపు బలం. సన్నీ సంగీతం అందిస్తున్నారు. మంచి టీం దొరికినందుకు ఆనందంగా ఉంది' అన్నారు.

నిర్మాత విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..

‘కథనానికి ప్రాధాన్యం ఉన్న చిత్రం ఇది. మూడు షెడ్యూల్స్ లో మేలో చిత్రాన్ని పూర్తి చేసి, జూన్ చివర్లో సినిమాను విడుదల చేస్తాం. యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీం దొరికింది. ఎంతో ఎనర్జిటిక్ గా సినిమా మొదలు పెట్టాం. అంతే ఎర్జిటిక్‌గా పూర్తి చేస్తాము.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ...

‘చాలా ఫ్రెష్ గా అనిపించే కథ కథనాలతో పట్టు సడలకుండా సాగే సినిమా ఇది. నా తొలి సినిమాకే సుధీర్ బాబు లాంటి హీరో దొరకడం చాలా ఆనందంగా ఉంది. టాప్ టెక్నీషియన్స్ నా సినిమాకి పని చేస్తున్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా పట్ల యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాం' అన్నారు.

నటీనటులు

సుధీర్ బాబు, వామికా గబ్బి, పోసాని, పృథ్విరాజ్, పరుచూరి గోపాల కృష్ణ, ప్రవీణ్, వేణు, విద్యులేఖ, శ్రీరామ్ తదితరులు నటిస్తున్నారు.

తెర వెనక

ఈ చిత్రానికి కో-డైరెక్టర్: శ్రీరామ్ ఎగరం, కాస్ట్యుం డిజైనర్: భాస్కర్, ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ, పి.ఆర్.ఓ: సాయి వరుణ్, మాటలు: అర్జున్ గున్నాల, కార్తీక్, కెమెరా: ష్యామ్ దత్, సంగీతం: ఎంఆర్: సన్నీ, నిర్మాతలు: విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి, దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య.

English summary
Sudheer babu New movie launch through the hands of Superstar Krishna Daughters.
Please Wait while comments are loading...