» 

వెన్నెలైనా... చీకటైనా అంటున్న సుధీర్‌ బాబు

Posted by:
Give your rating:

హైదరాబాద్: కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన 'పచ్చని కాపురం'లోని 'వెన్నెలైనా చీకటైనా నీతోనే జీవితమూ' ఎంత సూపర్ హిట్టో తెలిసిందే. ఇప్పుడు ఆ పాటని రీమిక్స్‌ చేస్తున్నారు. 'ఒక ప్రేమకథా చిత్రమ్‌' కోసం ఈ పాట మరోసారి తెరకెక్కి అలరించనుంది. కృష్ణ అల్లుడు సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న చిత్రమిది. నందిత హీరోయిన్. మారుతి నిర్మాత. ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

త్వరలో 'వెన్నెలైనా.. చీకటైనా..' పాటని హీరో,హీరోయిన్స్ పై చిత్రీకరించనున్నారు. ''పాత పాట విషాద గీతం. ఈసారి మాత్రం హుషారుగా మార్చాం. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది''అని యూనిట్ తెలిపింది. జె.బి. స్వరాలు సమకూరుస్తున్నారు. 'ఎస్.ఎం.ఎస్.' ఫేమ్ సుధీర్‌బాబు, 'నీకు నాకు' ఫేమ్ నందిత జంటగా రూపొందుతున్న 'ప్రేమకథా చిత్రమ్' కావటంతో మార్కెట్లో క్రేజ్ వచ్చింది. 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్' సినిమాల ఛాయాగ్రాహకుడు జె. ప్రభాకరరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతుండగా ఆ సినిమా దర్శకుడు మారుతి ఈ చిత్రానికి కథ, సంభాషణలు, స్కీన్‌ప్లే సమకూరుస్తుండటం విశేషం. ఆయనే ఆర్. సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆర్.పి.ఎ. క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మారుతి మాట్లాడుతూ "నా డైరెక్షన్‌లో చేద్దామని సిద్ధం చేసుకున్న కథ ఇది. ప్రస్తుతం నేను వేరే సినిమాలు అంగీకరించడం వల్ల ఈ చిత్రం ద్వారా మా సినిమాటోగ్రాఫర్ ప్రభాకరరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. హాస్యం, భయం, సరసం నేపథ్యంలో కథ నడుస్తుంది. 2013 వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు. 'ఎస్.ఎం.ఎస్.' తర్వాత గ్యాప్ తీసుకుని ఓ చక్కని స్క్రిప్టుతో ఈ సినిమా చేస్తున్నానని హీరో సుధీర్‌బాబు తెలిపారు.

మారుతి మునుపటి చిత్రాలకు భిన్నంగా కొత్త పంథాలో సినిమా ఉంటుందన్నారు. మంచి కథతో దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉందని ప్రభాకరరెడ్డి చెప్పగా, మారుతి సంస్థలో అవకాశం రావడం ఆనందంగా ఉందని నందిత అన్నారు. ప్రవీణ్, హాసిక, రణధీర్, అదుర్స్ రఘు, ఏలూరు శ్రీను తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: జె.బి., కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్, కళ: గోవింద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. శ్రీనివాసరావు, సహ నిర్మాతలు: ఆర్. ఆయుష్‌ రెడ్డి, ఆర్.పి. అక్షిత్‌రెడ్డి, ఛాయాగ్రహణం, దర్శకత్వం: జె. ప్రభాకరరెడ్డి.

Read more about: bus stop, krishna, sudheer babu, బస్ స్టాఫ్, కృష్ణ, సుధీర్ బాబు
English summary
Remix bug has bitten Sudheer Babu (Mahesh Babu's brother-in-law) too as the actor is all set to remix one of the superstar Krishna's super hit number. Sudheer Babu's upcoming film Prema Katha Chitram will feature the remix version of the famous number 'Vennelaina Cheekataina' from Krishna and Sridevi-starrer Pachani Kapuram.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive