» 

'ఏమో గుర్రం ఎగరావచ్చు' రిజల్ట్ ఏంటి

Posted by:

హైదరాబాద్ : వరస ఫ్లాపుల్లో ఉన్న సుమంత్ ఈ సారి నవ్వించి హిట్ కొడతానంటూ 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రంతో శనివారం ముందుకు వచ్చాడు. అనుకున్న రోజు కంటే ఓ రోజు లేటుగా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగానూ బాగా లేటుగా వచ్చిన సినిమా అని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ చిత్రంలో సుమంత్ బుల్లబ్బాయ్ గా కామెతో కూడిన ఓ విలక్షణమైన పాత్రను పోషించారు. కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. పాటలు ఇప్పటికే మంచి హిట్టయ్యాయి. అయినా ఫలితం నెగిటివ్ గా వచ్చింది.

అక్షయ్ కుమార్, కత్రినాకైఫ్ కాంబినేషన్ లో వచ్చిన నమస్తే లండన్ చిత్రానికి నకలు ఈ చిత్రం అని తేలటంతో కథ,కథన పరంగానూ అంతా పెదవి విరుస్తున్నారు. చంద్రసిద్దార్ద గత చిత్రాలు తరహాలో ఈ చిత్రం ఉంటుందని థియోటర్ కి వెళ్లిన వారికి నిరాసే మిగిలింది. పరమ రొటీన్ కథను అంతకంటే రొటీన్ గా దర్శకుడు డీల్ చేసాడని టాక్ వినిపించింది.

కథేమిటంటే...పదోతరగతి పద్నాలుగుసార్లు తప్పిన బుల్లెబ్బాయ్‌( సుమంత్) కి ఓ కోరిక ఉంది. అదే.. అమెరికాకు వెళ్లడం. అలాగే అతనికి మరదులు నీలవేణి(పింకీ) అంటే చాలా ఇష్టం. అమెరికాలో సెటిల్ అయిన ఆమెకు సంభంధాలు చూస్తూంటే వేరే దారిలేక బుల్లెబ్బాయిని పెళ్లిచేసుకుంటుంది. అతని పెళ్లిచేసుకుని అమెరికా వెళ్లి అక్కడ విడాకులు ఇచ్చి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆమె ఆలోచన. ఇదంతా బుల్లిబ్బాయికి తెలుసు. కానీ కాదనుకుంటా పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఏమైంది. వారి వివాహ బంధం ఏ తీరానికి చేరిందనేది మిగతా కథ.

బ్యానర్ : చెర్రీ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్
నటీనటులు : సుమంత్, పింకీ సావిక, కాంచి తదితరులు
కథ,మాటలు: కాంచి
కెమెరా : చంద్రమౌళి,రాజేంద్ర
ఆర్ట్: నాగేంద్ర
స్టైలింగ్ :సీత కాంచి
ఎడిటింగ్: జీవి చంద్రశేఖర్
సంగీతం: కీరవాణి
నిర్మాత: పూదోట సుధీర్‌కుమార్
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: చంద్ర సిద్దార్ధ

Read more about: sumanth, emo gurram egaravachu, pinki savika, సుమంత్, ఏమో గుర్రం ఎగరావచ్చు, పికీ సావిక
English summary
Sumanth's latest Gurram Egaravachu directed by Chandra Siddhartha released with divide talk. Sumanth play this character who struggles to pass class X. He has appeared 14 times for the exam but has not passed it. It’s a high energy village character who wants to get a visa to go to the United States.
Please Wait while comments are loading...