twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీర్య దానం గురించి నాగార్జున బాగా చెప్పారు, అదే ప్లస్ అవుతుంది

    By Srikanya
    |

    హైదరాబాద్ : అప్పట్లో వచ్చిన సత్యం,యువకుడు వంటి సినిమాలు తప్ప చెప్పుకోవటానికి కెరీర్ లో పెద్దగా సినిమాలు లేని హీరో సుమంత్. ఆయన 2014లో చేసిన 'ఏమో గుర్రం ఎగరా వచ్చు' డిజాస్టర్ కావటంతో లాంగ్ గ్యాప్ తీసుకుని, ఇప్పుడు ఓ భిన్నమైన కాన్సెప్టు తో 'నరుడా డోనరుడా' అని మన ముందుకు రావటానికి ప్లాన్ చేసుకున్నారు.

    హిందీలో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న 'విక్కీ డోనార్' అనే సినిమాకు రీమేక్ అయిన ఈ 'నరుడా డోనరుడా' ఈ రోజు (నవంబర్ 4న) రిలీజ్ అయ్యింది. చివరి నిముషంలో పైనాన్సియల్ గా కొన్ని సమస్యలు వచ్చి, రిలీజ్ ఆగే పరిస్దితి వచ్చింది కానీ రిలీజ్ అయ్యింది.

    నాగార్జున మొదటే కనపడి

    నాగార్జున మొదటే కనపడి

    ఇక ఈ చిత్రంలో నాగార్జున మొదట కొద్ది సేపు కనపడి..వీర్యదానం గురించి చెప్తారు. అలాగే వీర్యదానం అవసరం గురించి వివరించారు. నాగార్జున వంటి స్టార్ వచ్చి గెస్ట్ గా ఇలాంటి విషయాలు చెప్పటంతో సినిమాపై కొంత మొదటే మంచి గౌరవం ఏర్పడింది.

    నేను కూడా చేస్తాను

    నేను కూడా చేస్తాను

    "పిల్లలు పుట్టే సమయంలో భార్య భర్తలు మధ్య భయాలు, కాంప్లెక్స్ లు వంటి వాటికి సంబంధించిన సినిమా. ఇప్పటి రోజుల్లో మెసేజ్‌, ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఉన్న సినిమాలు రావడం కష్టమైపోయాయి. కానీ ఈ సినిమాకు కుదిరాయి. కొత్తగా ఉన్నప్పుడు ఏ కథనైనా నేను కాదనను. ఇలాంటి కథ నాకు వచ్చినా చేసేవాడిని .అంత బావుంది" అని నాగార్జున అన్నారు.

    వీర్యదానంతో

    వీర్యదానంతో

    హైదరాబాద్‌కి చెందిన షేక్‌పేట కుర్రాడు విక్రమ్‌ (సుమంత్‌). జేబు ఖర్చులకి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడే ఓ సగటు నిరుద్యోగి. అనుకోకుండా అతడితో సంతాన సాఫల్య వైద్యుడైన డా.ఆంజనేయులు (తనికెళ్ల భరణి)కి అవసరం ఏర్పడుతుంది. వీర్యం దానం చేయాలని, చేస్తే డబ్బు ఇప్పిస్తానని విక్రమ్‌కి ఆశ చూపుతాడు ఆంజనేయులు.

    ఇంతకీ బెంగాళి అమ్మాయి ఎవరు

    ఇంతకీ బెంగాళి అమ్మాయి ఎవరు

    అప్పటిదాకా రక్తదానం గురించి, అవయవ దానం గురించి మాత్రమే విన్న విక్రమ్‌ వీర్యదానం చేసేందుకు ఒప్పుకొన్నాడా? అతనికీ, బెంగాలీ అమ్మాయి ఆషిమా రాయ్‌ (పల్లవి సుభాష్‌)కి మధ్యనున్న సంబంధమేమిటి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.

    ఎంటర్టైన్మెంట్ తో పాటు

    ఎంటర్టైన్మెంట్ తో పాటు

    హిందీలో విజయవంతమైన ‘విక్కీ డోనర్‌'కి రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమిది. పిల్లలు పుట్టే విషయంలో ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించే కథ. వినోదంతో పాటు, హృదయాన్ని హత్తుకొనే సన్నివేశాలతో తీర్చిదిద్దారు.

    దర్శకుడు ఎవరంటే..

    దర్శకుడు ఎవరంటే..

    సుమంత్‌తో పాటు, తనికెళ్ల భరణి తెరపై బలమైన పాత్రల్లో కనిపిస్తారు. సుమంత్‌ స్వయంగా నిర్మాణ వ్యవహారాల్ని చూసుకొన్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీనివాస్‌ అవసరాల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మల్లిక్‌రామ్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.కెరీర్‌కి వూపునిస్తుంది

    ఆలోచనలో పడేసింది

    ఆలోచనలో పడేసింది

    ‘‘2012లోనే ‘విక్కీ డోనర్‌' చూశా. బాగా నచ్చింది. అయితే రీమేక్‌ హక్కుల్ని తెలుగులో ఎవరో తీసుకొన్నారనే మాట వినిపించడంతో ఆ తర్వాత మళ్లీ ఆ సినిమాని పట్టించుకోలేదు. తాతగారు ఆయన చివరి రోజుల్లో ఆ సినిమాని టీవీలో చూసి ‘ఇలాంటివి తెలుగులో చేస్తే బాగుంటుంది. ఎక్కడా అసభ్యత లేకుండా చాలా బాగా తీశారు' అన్నారు. ఆ మాట నన్ను ఆలోచనలో పడేసింది.

    అప్పటినుంచే ఫ్రెండ్ కావటంతో..

    అప్పటినుంచే ఫ్రెండ్ కావటంతో..

    ఆ తర్వాత నా దగ్గరికి వచ్చే దర్శకులందరినీ ‘విక్కీ డోనర్‌'లాంటి కథ ఉంటే చెప్పండని అడిగేవాణ్ని. ఒకరిద్దరు ‘విక్కీ డోనర్‌'నే రీమేక్‌ చేస్తే బాగుంటుంది కదా అన్నారు. ఆ చిత్ర నిర్మాత జాన్‌ అబ్రహమ్‌ మోడల్‌గా ఉన్నప్పట్నుంచే నాకు స్నేహితుడు కావడంతో తన దగ్గరికి వెళ్లి ఆరా తీశా. తెలుగు హక్కుల గురించి ఇంతవరకూ నన్నెవరూ సంప్రదించలేదని చెప్పి హక్కుల్ని నాకు ఇచ్చారు.

    కొత్త ఎక్సపీరియన్స్ నిస్తుంది

    కొత్త ఎక్సపీరియన్స్ నిస్తుంది

    తెలుగులో ఈ తరహా కథలు ఇప్పటిదాకా తెరకెక్కలేదు. తప్పకుండా అందరికీ ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. సున్నితమైన అంశమైనా ఎక్కడా శ్రుతిమించకుండా చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దాడు దర్శకుడు మల్లిక్‌రామ్‌. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాల్ని కూడా నేనే దగ్గరుండి చూసుకొన్నా. ఈ సినిమాతో నిర్మాతలపై నాకు మరింత గౌరవం ఏర్పడింది.హీరోగా కూడా నా కెరీర్‌కి మళ్లీ వూపు తెచ్చే చిత్రమవుతుంది. వినోదంతోపాటు, మంచి భావోద్వేగాలు కూడా ఉంటాయి'' అన్నారు.

    దర్శకుడు మల్లిక్‌రామ్‌ మాట్లాడుతూ...

    దర్శకుడు మల్లిక్‌రామ్‌ మాట్లాడుతూ...

    ‘‘సామాజిక సమస్యతో కూడిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. సంతానలేమి అనే మాటని ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం. కానీ చాలామంది ఆ విషయం గురించి బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు. అసలు సంతాన లేమికి కారణమేంటి? వీర్యదానం చేస్తే ఏమవుతుంది? అనే విషయాల్ని వినోదాత్మకంగా చెబుతూనే ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాం. '' అన్నారు.

    ఆశ్లీలం తయారవుతుందని

    ఆశ్లీలం తయారవుతుందని

    నిజానికి ఏమాత్రం పట్టుతప్పినా ఈ కథ అశ్లీలంగా తయారవుతుంది. కానీ మేం ఆద్యంతం వినోదాత్మకంగా, ఎక్కడా అశ్లీలతకి చోటు లేకుండా చిత్రాన్ని తీర్చిదిద్దాం. సుమంత్‌ నటనలోని ఓ కొత్త కోణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. తనికెళ్ల భరణి, పల్లవి సుభాష్‌, శ్రీలక్ష్మిల నటన, శ్రీచరణ్‌ పాకాల సంగీతం చాలా బాగుంటుంది. దర్శకుడిగా నా తొలి చిత్రమే ఓ మంచి కథతో తెరకెక్కడం ఆనందంగా ఉంది

    ఈ సినిమాకు పనిచేసింది వీళ్లే...

    ఈ సినిమాకు పనిచేసింది వీళ్లే...

    బ్యానర్: ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్
    నటీనటులు: సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ల భరణి, సుమనశెట్టి, శ్రీలక్ష్మి, శేషు, భద్రమ్‌, తదితరులు
    సినిమాటోగ్ర‌ఫీ: షానియల్ డియో,
    మ్యూజిక్ః శ్రీర‌ణ్ పాకాల‌,
    ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌,
    ఆర్ట్ః రామ్ అర‌స‌వెల్లి,
    డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌,
    లైన్ ప్రొడ్యూస‌ర్ః డా. అనిల్ విశ్వ‌నాథ్‌,
    నిర్మాతలు: వై.సుప్రియ, జాన్‌ సుధీర్‌ పూదోట,
    దర్శకత్వం: మల్లిక్‌రామ్‌
    స‌మ‌ర్ప‌ణః అన్న‌పూర్ణ స్టూడియోస్‌,
    విడుదల: శుక్రవారం, నిడివి: 2 గంటల 5 నిమిషాలు

    English summary
    Sumanth’s Naruda Donaruda was gearing up for a huge release today. But sadly, the film’s release has been stalled as of now due to some financial issues with the producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X