Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ హీరోయిన్ చెల్లే...సునీల్ కి జోడి (ఫొటో)
హైదరాబాద్ : సునీల్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ దొరికింది. ఆమె మరెవరో కాదు... ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై' ఫేం సంజన సోదరి నిక్కి గార్లని. ఆమెను సునీల్ సరసన హీరోయిన్గా ఎంపిక చేసారు. తమిళ మరియు కన్నడ చిత్రాలలో నటించిన నిక్కి గార్లనికి తెలుగులో ఇదే మొదటి సినిమా. తెలుగులో హిట్టైన ‘ప్రేమకథా చిత్రమ్' తమిళ రీమేక్ ‘డార్లింగ్'లో నిక్కి నటన చూసి నచ్చిన దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశం ఇచ్చారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఇక సునీల్ హీరోగా ‘జోష్' ఫేం వాసు వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం ఆ మధ్యన ప్రారంభమైంది. దిల్ రాజు మాట్లాడుతూ... వాసు వర్మ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. జోష్ సినిమాతో వాసు వర్మను దర్శకుడిగా పరిచయం చేశాం. ఆ సినిమా మేం ఆశించిన విజయం సాదించలేదు. ఈ సినిమా అతని టాలెంట్ ప్రూవ్ చేసుకునే సినిమా అవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. విలువలతో కూడిన వినోదాత్మక సినిమా. కోన చక్కని కథను రెడీ చేశారు. ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
నా కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచే సినిమా అవుతుందని భావిస్తున్నాను. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది అని సునీల్ అన్నారు. నా టాలెంట్ పై నమ్మకం ఉంచిన దిల్ రాజు, సునీల్ గార్లకు థాంక్స్ అని దర్శకుడు వారు వర్మ అన్నారు. ఈ సినిమా ద్వారా దినేష్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కోన వెంకట్ రచయితగా పని చేస్తున్న ఈ సినిమాకు దినేష్ సంగీతం అందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.
మిస్టర్ పెళ్లి కొడుకు, భీమవరం బుల్లోడు చిత్రాల పరాజయం తర్వాత సునీల్ మరో చిత్రం ఒప్పుకున్నట్లు ఎక్కడా కనపడలేదు. అప్పుడప్పుడూ ఆ దర్శకుడుతో, ఈ నిర్మాతతో...ఫలానా బ్యానర్ లో అని వార్తలు వచ్చినా అవేమీ ముందుకు వెళ్లినట్లు కనపడలేదు. కష్టపడి సిక్స్ ప్యాక్ చేసిన తర్వాత సునీల్ కు సరైన స్క్రిప్టు ఒక్కటీ కనపడలేదు. అందాలు రాముడు, మర్యాద రామన్న రేంజి హిట్ ఒక్కటి అతని కెరీర్ లో రాలేదు. పూలరంగడు బాగా ఆడినా అతనికి పెద్ద ప్లస్ కాలేకపోయింది. ఇవన్నీ ప్రక్కన పెడితే సునీల్ ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు.