twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్వేచ్చా జీవితంపై సునీత షార్ట్ ఫిల్మ్, సూపర్ సక్సెస్, మీరు చూసారా?

    By Srikanya
    |

    హైదరాబాద్‌: గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, యాంకర్‌గా పేరు తెచ్చుకున్న సునీత తొలిసారి నటించిన 'రాగం' అనే షార్ట్ ఫిల్మ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. స్వేచ్ఛగా జీవించాలనుకునే మహిళను ఈ సమాజం ఎలా చూస్తుంది? అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ నెల 7న యూట్యూబ్‌లో విడుదలైన ఈ షార్ట్ పిల్మ్ ని ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల మంది వీక్షించారు.

    సునీత నటన బాగుందని, మంచి కథతో సమాజానికి ఓ సందేశాన్ని ఇచ్చారని, దర్శకుడు లఘు చిత్రాన్ని చక్కగా తీశారని వీక్షకులు యూట్యూబ్‌లో కామెంట్స్‌ చేశారు. 'రాగం' లఘు చిత్రంలో భాగస్వాములైన వారందరికీ సునీత తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

    ఈ లఘు చిత్రంలో సునీతతోపాటు సమీర్‌, సాయికిరణ్‌ రామ్‌, సన శనూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ చైతు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వంశీరెడ్డి, వి.లక్ష్మి నారాయణ నిర్మించారు. ఇందులోని పాటను సునీత, సునీల్‌ కశ్యప్‌ ఆలపించారు.

    English summary
    Sunitha says thanks to Ragam short film team. This film revolves around Pravallika an Independent woman who tries to hide herself due to few circumstances and later on realises what she is meant to be. This is not just a film , but its a moment which will truly make people think about to relate themselves.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X