twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజినీ "కాంట్"...!? అలాజరగదు, రజినీ స్నేహితున్ని అంటూనే ఇలా చెప్పాడు

    తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసు ఇదే విషయం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజినీ రాజకీయాల్లోకి వస్తే సొంత పార్టీ నుంచే తప్ప వేరే పార్టీల జండాలకు తలొగ్గదని చెప్పాడు.

    |

    రజనీ రాజకీయాల్లో వస్తారా? రారా? అన్న అంశంపై దశాబ్దాలుగా సాగుతున్న ఆసక్తికర చర్చకు తెర దించుతూ సూపర్ స్టార్ ఇవ్వాల్సిన సంకేతాలు ఇచ్చేసిన సంగతి తెలిసిందే.తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తమిళుల ఆరాధ్య నటుడు.., భారతీయులందరికీ అభిమాన హీరో, ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు సినిమా పరంగా గుర్తింపు ఉంది. జపాన్, చైనా లో కూడా ఈయన సినిమాలు సూపర్ గా ఆడాయంటే ఏ రేంజ్ లో అక్కడ కూడా పాపులారిటీ సంపాదించాడు.భారత దేశానికి సంబందించినంత వరకూ రజినీ కాంత్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు అతనొక "హీరో". ఇప్పుడు ఆ హీరో రాజకీయ ప్రవేశం ఖరారైనట్టేనా? ఈ రోజు రజినీకాంత్ స్పీచ్ విన్నవాళ్ళందరికీ వచ్చిన అనుమానం ఇదే. రజినీ చేసి అత్యద్బుత ప్రసంగం అందర్నీ ఆలోచనలో పడేసింది...

    మీడియా వెంటాడుతోందంటూ

    మీడియా వెంటాడుతోందంటూ

    మొన్నటికి మొన్న నేను పరాయి రాష్ట్రం లో పుట్టినా నన్ను అభిమానులు తమిళుడిగా మార్చేసారు , నేను ఇప్పుడు పూర్తి తమిళున్ని అంటూ, తన స్థానికత మీద మీడియా వెంటాడుతోందంటూ వ్యాఖ్యానించాడు రజినీ, ఉన్నట్టుండీ తన స్థానికత ను నిరూపించుకోవాలనే ఆలోచన వచ్చిందంటేనే రజినీ రాజకీయ ప్రవేశం కోసం ప్రయత్నం మొదలయ్యిందనే సంకేతాలు అందాయి.

    రజినీ రాజకీయ ప్రవేశం

    రజినీ రాజకీయ ప్రవేశం

    అయితే రజినీ రాజకీయ ప్రవేశం ఏ పార్టీతో జరగనుందనే చర్చ మొదలయ్యింది. అంతే కాదు రాజకీయాల్లోకి అడుగు పెడితే తర్వాత సినిమాలు చేస్తాడా చెయ్యడా అనే అనుమానం కూడా మొదలయ్యింది. ఇప్పుడు తమిళనాట రజనీ రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన రాజకీయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడుహాట్ టాపిక్ గా మారింది. ఏదైనా పార్టీలో చేరతారా? తానే కొత్తగా పార్టీ పెడతారా? అన్న ప్రశ్నల మీద పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తోంది.

    పీసీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసు

    పీసీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసు

    ఇటు ఈ చర్చలు సాగుతూంటే తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసు ఇదే విషయం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీ తనకు చాలా కాలం నుంచి తెలుసని.. ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయన్న విషయం మీద తనకుస్పష్టత ఉందన్న ఆయన.., రజినీ రాజకీయాల్లోకి వస్తే సొంత పార్టీ నుంచే తప్ప వేరే పార్టీల జండాలకు తలొగ్గదని చెప్పాడు.

    ప్రాంతీయ పార్టీ ని స్థాపిస్తాడా

    ప్రాంతీయ పార్టీ ని స్థాపిస్తాడా

    రజినీ తమిళనాడులో ప్రత్యేకంగా ఒక ప్రాంతీయ పార్టీ ని స్థాపిస్తాడంటూ ఆయన చెప్పిన జోస్యం ఇప్పుడు మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే గతం లో ఒకసారి జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన రజినీ కి ఓటర్లు వేరు అభిమానులు వేరూ అన్న విషయం అర్థమయ్యింది.

    రజినీ కొత్త పార్టీ

    రజినీ కొత్త పార్టీ

    అందు కే తర్వాత జయతో మంచిగానే ఉంటూ ఆవిడకే తన మద్దతు కూడా తెలియ జేసాడు రజినీ. ఇలాంటి పరిస్థితుల్లో రజినీ కొత్త పార్టీ ఇప్పటికే ఉన్న ఓటర్లని తమవైపుకు తిప్పుకొని ఓట్లని చీల్చగలదా? ఒక వేళ ఓట్లు వచ్చినా రజినీ ముఖ్య మంత్రి అయ్యే అవకాశాలున్నాయా అన్న ప్రశలూ రావటం సహజం...

    రజనీ పార్టీ పెడితే

    రజనీ పార్టీ పెడితే

    కానీ తిరునావుక్కరసు మాత్రం రజనీ తనకు 35-40 ఏళ్లుగా తెలుసని.. ఒక స్నేహితుడిగా ఆయన గురించి తెలిసిన వాడిగా తాను చెబుతున్నానని.. ఆయనే పార్టీలోనూ చేరతారని తాను అనుకోవటం లేదన్నారు. రజనీ పార్టీ పెడితే ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది ఆయన ఇష్టమని.. ఆ అంశంపై తానేమీ చెప్పలేనన్నారు.

    తమిళ రాజకీయాల్లో పెను మార్పు

    తమిళ రాజకీయాల్లో పెను మార్పు

    మొత్తానికి రజనీ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా తిరునావుక్కరసు చెప్పిన మాటల్లో నిజంఎంతన్నది కాలమే తేల్చాలి. వచ్చే ఎన్నికల్లో రజినీ పోటీ చేస్తే తమిళ రాజకీయాల్లో పెను మార్పు వస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... మరి రజినీ ముఖ్యమంత్రి అవుతాడా లేక టాలీవుడ్ లో చిరంజీవి లాగా మిగిలి పోతాడా అన్న ప్రశ్న కి సమాధానం కోసం ఎదురు చూడటమే ఇప్పుడు మనం చేయాల్సింది.

    English summary
    Tamil Nadu Congress Committee President Su Thirunavukkarasar on Sunday said that he believes Tamil 'Superstar' Rajinikanth will not join any national or regional political party but will only float his own party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X