twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దెయ్యాలను చూస్తూ సాయం చేస్తాడు ( సూర్య 'రాక్షసుడు' ప్రివ్యూ విత్ స్టోరీ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : విభిన్న చిత్రాల దర్సకుడు వెంకట ప్రభు. ఆయన నుంచి కొత్త చిత్రం వస్తోందంటే సినిమా ప్రియులు ఆసక్తిగా చూస్తారు. దానికి తోడు ఆయన సూర్య వంటి స్టార్ హీరోని అండగా తీసుకుని చెలరేగపోవటానికి వస్తున్నాడంటే మరీను. అయితే సూర్య సినిమాలు ఈ మధ్య భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతున్నాయి. దర్సకుడు వెంకట్ ప్రభు..గత చిత్రం బిర్యాని(కార్తి) కూడా ఫ్లాఫ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పై అంచనాలు కాస్త తక్కువుగానే ఉన్నాయి. కానీ ప్రోమోలు, టైటిల్ తో కొత్త చిత్రం ఆవిష్కరించబోతున్న ఫీలింగ్ కలుగ చేసారు కాబట్టి ఓపినింగ్స్ బాగానే ఉండవచ్చు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ చిత్రం కథేమిటంటే...సూర్య, ప్రేమ్ జీ ఇద్దరూ చిన్న సైజు దొంగలు. వారు దొంగతనాలు చేసుకుంటూ జీవితం గడువుతూంటే ఓ రోజు అనుకోని విధంగా ప్రేమ్ జీ చనిపోతాడు. దాంతో సూర్య డల్ అయిపోతాడు.తర్వాత కొద్ది రోజులుకు అతనికి ప్రేమ్ జీ కనపడటం ప్రారంభిస్తాడు. అప్పుడు సూర్యకు అర్దమవుతుంది...తనకు దెయ్యాలను చూసే పవర్ వచ్చిందని. కొద్ది రోజులుకే అతను చాలా దెయ్యాలను చూడటం మొదలెడతాడు. అవన్ని తమ తమ సమస్యలకు అతన్ని పరిష్కారం అడుగుతూంటాయి.

    Suriya's Rakshasudu movie preview

    సూర్య దొంగతనాలు ఆపేసి...ఆ దెయ్యాలను రకరకాల ఇళ్లకు పంపి..వాటిని తరిమేస్తూ..డబ్బు సంపాదిస్తూంటాడు. అయితే ఓ రోజు ఓదెయ్యాన్ని ఓ ఇంటినుంచి తరుముదామని వెళితే అక్కడ షాక్ కు గురి అవుతాడు. అక్కడ ఉన్న దెయ్యం...అచ్చం అతని పోలికలోనే ఉంటుంది. అక్కడ నుంచి ఏం జరుగుతుంది. అసలు ఈ దెయ్యాలు గోల ఏంటి...తన పోలికలతోనే ఉన్నవాడు ఎవరు అనేది తెలుసుకోవాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

    దర్శకుడు మాట్లాడుతూ... రాక్షసుడంటే నెత్తిమీద రెండు కొమ్ములు, నిప్పులు చిమ్మే కళ్లు, బయటకొచ్చిన పళ్లూ, ఒళ్లంతా రక్తం ఇవేం వూహించుకోకండి. ఇతనో స్త్టెలిష్‌ రాక్షసుడు. ప్రేమిస్తాడు, స్నేహం చేస్తాడు, మంచి కోసం ప్రాణాలిస్తాడు. కానీ అతన్ని అంతా 'రాక్షసుడు' అని పిలుచుకొన్నారు. కారణమేంటో తెలియాలంటే 'రాక్షసుడు' సినిమా చూడాల్సిందే అన్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ ''సూర్య ప్రయాణం ముందు నుంచీ వైవిధ్యభరితంగానే సాగుతోంది. 'గజిని', 'సింగం' లాంటి చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకొన్నారు. 'రాక్షసుడు' ఆ చిత్రాల జాబితాలో చేరుతుంది. ఈ చిత్రంలో సూర్య విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారు. ఆయన పాత్ర పెద్దలకే కాదు, పిల్లలకూ నచ్చుతుంది. హారిస్‌ జైరాజ్‌ అందించిన బాణీలకు చక్కటి స్పందన వస్తోంది''అన్నారు.

    Suriya's Rakshasudu movie preview

    బ్యానర్ :మేధా క్రియోషన్స్
    నటీనటులు :సూర్య, నయనతార, ప్రణీత, ప్రేమ్ జీ తదితరులు
    ఛాయాగ్రహణం: రాజశేఖర్
    మాటలు: వెన్నెలకంటి
    సంగీతం :యవన్ శంకర్ రాజా
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకట్‌ ప్రభు
    నిర్మాతలు: కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి
    సమర్పణ: జ్ఞాన్‌వేల్‌రాజా
    విడుదల తేదీ :29, మే 2015.

    English summary
    Surya, Nayanatara, Praneetha's Rakshasudu directed by Venkat Prabhu hit the screens today in a grand manner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X