»   »  మహేష్ ‘సీతమ్మ వాకిట్లో...’ రేలంగి టు భద్రాద్రి

మహేష్ ‘సీతమ్మ వాకిట్లో...’ రేలంగి టు భద్రాద్రి

Posted by:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ రరసన అంజలి నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ తణకు సమీపంలోని రేలంగిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ షెడ్యూల్ పూర్తి కాగానే ఈనెల 16వ తేదీ నుంచి నెక్ట్స్ షెడ్యూల్ భద్రాచలంలో ప్రారంభం కానుంది. భద్రాచంలంలో రాముడి ఆశీస్సులు తీసుకునే పలు కీలక సీన్లు చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రం కాన్సెప్టు గురించి చెపుతూ నిర్మాత దిల్ రాజు ఆ మధ్య మాట్లాడుతూ...ఉమ్మడి కుటుంబంలో అనుబంధాలూ ఆప్యాయతలూ చూసి ఎంతకాలమైంది? ఉద్యోగం పేరుతో ఒకరు రెక్కలు కట్టుకొని విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇంకొకరిది పట్నవాసం. ఇంటిల్లిపాదీ మళ్లీ కలుసుకోవాలంటే పండగో, పెళ్లిపిలుపో రావాల్సిందే. అప్పుడు కూడా సెలవులు దొరికితేనే! అందుకే బాబాయ్‌, పిన్ని, వదిన, మేనత్త... ఇలాంటి పిలుపులకు దూరమైపోతున్నాం. ఆరు బయట వెన్నెల్లో కబుర్లు చెప్పుకొనే రోజులు మర్చిపోతున్నాం. మళ్లీ అలాంటి వాతావరణం మా సినిమాలో చూడొచ్చు అన్నారు.

పూర్తి కుటుంబ కథా చిత్రం రూపొందుతున్న ఈచిత్రం మహేష్ బాబు గత సినిమాలకు భిన్నంగా... మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ను మెప్పించేలా అన్ని చిత్రీకరిస్తున్నారు. దసరా నాటికి ఈచిత్రం ప్రేక్షుకుల తెచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: గుహన్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

English summary
Seethamma Vakitlo Sirimalle Chettu is the multi-starrer with Venkatesh, Mahesh Babu, Anjali and Samantha in the lead roles. SVSC is taking fast shape in the hands of director Srikanth Addala and the team is heading to Bhadrachalam for the next schedule from July 16. The unit of SVSC is currently busy canning some important scenes for the movie in Relangi near Tanuku and is planning for the next schedule of the film in Bhadrachalam to seek the blessings of lord Rama.
Please Wait while comments are loading...