» 

ప్రసాద్స్ ఐమాక్స్‌లో SVSC రికార్డ్

Posted by:
 

హైదరాబాద్ : మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఇప్పటికే పలు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం హైదరాబాద్ ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించి ఇప్పటి వరుకు అక్కడ ప్రదర్శితం అయిన తెలుగు సినిమాలన్నింటీ వెనక్కి నెట్టి నెం1 పొజిషన్లో నిలిచింది. ఈ విషయాన్ని ప్రసాద్ ఐమాక్స్ కు సంబంధించిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ కూడా ఖరారు చేసింది. అయితే కలెక్షన్ ఎంత? అనేది మాత్రం బయటికి వెల్లడించలేదు.

ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.....ఈ చిత్రం ఇక్కడ తొలివారం రూ. 70 లక్షలకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ తొలివారం రూ. 58 లక్షలు వసూలు చేసి నెం.1 స్థానంలో ఉండేది. తాజాగా SVSC ఆ రికార్డ్ బద్దలు కొట్టింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా....నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై భారీ తారాగణంతో కూడిన మల్టీ స్టారర్ సినిమా రావడం, ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమా కావడంతో ఆదరణ పెరుగుతోంది.

మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి హీరో హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు నటించిన ఈచిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ: గుహన్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

Read more about: mahesh babu, venkatesh, seethamma vakitlo sirimalle chettu, మహేష్ బాబు, వెంకటేష్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
English summary
SVSC movie creating records sensation in Prasads Multiplex Hyderabad with highest number of collections by standing no.1 position in Indian Telugu Cinema.
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos