twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సహజీవనంపై తాప్సీ షాకింగ్ కామెంట్ (ఇంటర్వూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'గుండె ఝల్లుమంది' చిత్రంలో అందాల తారగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి తాప్సీ. కత్తిలాంటి చూపులతో కుర్రకారు మతిపోగొట్టిన ఈ సుందరాంగి తాజాగా 'కాంచన 2' ద్వారా అదే ప్రేక్షకులను భయపెట్టేసింది. మాటలకు మేకప్ వెయ్యకుండా కుండబద్దలు కొట్టే హాట్ బ్యూటీ తాప్సీ పన్ను.. కెరీర్ గురించి,కష్టాల గురించి,సహ జీవనంపై, అశ్లీల చిత్రాల పై మాట్లాడింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ప్రముఖ హీరోయిన్ స్థాయి కోసం పోరాడుతున్న నటీమణుల్లో తాప్సీ ఒకరు. వాణిజ్య ప్రకటనలతో నట జీవితాన్ని ప్రారంభించిన ఈ ఉత్తరాది బ్యూటీ సినిమా రంగప్రవేశం చేసి నంబర్‌వన్ హీరోయిన్ అయిపోదామనే కలలుకన్నారు. అయితే ఆమె ఆశించినట్లుగా దక్షిణాది భాషలైన తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినా టాప్ హీరోయిన్ కల ఇంకా నెరవేరలేదు. తమిళం, తెలుగు భాషల్లో యువ హీరోలందరి సరసన నటించారు. అయినా ఎందుకనో తాప్సీ హీరోయిన్‌గా సరైన స్థాయికి చేరుకోలేకపోయారు. ప్రస్తుతం అవకాశాలు కూడా అంతంత మాత్రమే.

    దక్షిణాది చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 'చష్మే బహదూర్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'బేబీ' సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలోనే మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం 'రన్నింగ్ షాదీ డాట్ కామ్' చిత్రంలో నటిస్తోంది. అందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా.. దెయ్యంలా నటించి కూడా మెప్పించగలనని రుజువు చేసింది. ఈ సినిమాతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిందనే చెప్పాలి తాప్సీ. ఈ సందర్భంగా ఆమె మీడియాతో పలు విషయాలపై చెప్పిన విశేషాలేంటో తెలుసుకుందాం..

    స్లైడ్ షోలో...తాప్సీ ఇంటర్వూ...

     'ఓకే బంగారం' లోలాగ సహజీవనం చేసుకునే సంప్రదాయం పై

    'ఓకే బంగారం' లోలాగ సహజీవనం చేసుకునే సంప్రదాయం పై

    జ: పెళ్లి చేసుకోకుండా కలిసి జీవిస్తే తప్పేంటి. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడంతో ఇరు కుటుంబాలకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కానీ పెళ్లి చేసుకోకుండా కలిసి జీవిస్తూ.. నచ్చకపోతే విడిపోవచ్చు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.

     హీరోయిన్ల పేరిల వచ్చే నకిలీ అశ్లీల చిత్రాల పై

    హీరోయిన్ల పేరిల వచ్చే నకిలీ అశ్లీల చిత్రాల పై

    జ: బుద్ధి, జ్ఞానం లేనివారు చేసే పనులవి. హీరోయిన్‌కు మాత్రమే కాదు.. సాధారణ స్త్రీకి కూడా భద్రత లేకుండా పోయింది. లైంగిక వేధింపులు పెను సమస్యగా మారింది. అలాంటి చర్యలకు పాల్పడే వారికి.. అవయవాలు పనిచేయనివ్వకుండా శిక్షించాలి. అదే అత్యాచారాలకు సరైన శిక్ష.

     దెయ్యం పాత్రలో నటించడానికి ఎలా ఒప్పుకున్నారు.?

    దెయ్యం పాత్రలో నటించడానికి ఎలా ఒప్పుకున్నారు.?

    'కాంచన 2' కథ విన్న తర్వాత అందులో నటించడానికి ఒప్పుకోవడానికి రెండు నెలల సమయం తీసుకున్నా. దెయ్యం పాత్రలో నటించడానికి ప్రారంభంలో వెనకడుగు వేశా. అయితే లారెన్స్‌ నన్ను ఎక్కువగా సపోర్ట్‌ చేశారు. 'ఇది మంచి పాత్ర. నువ్వు నటిస్తే బాగుటుంది. తప్పకుండా చేయగలవ'ని చెప్పి నన్ను ఒప్పించారు.

    ఆలోచనలో పడ్డా..

    ఆలోచనలో పడ్డా..

    కానీ ఆ తర్వాత నేను కాస్త ఆలోచనలో పడినా.. తప్పకుండా ఈ చిత్రం నీ కెరీర్‌ను మలుపు తిప్పుతుంది. మంచి గుర్తింపు వస్తుందని ఆయన దైర్యం చెప్పారు.

    'కాంచన 2', హిందీ చిత్రం 'బేబి' రెండూ హిట్లే?

    'కాంచన 2', హిందీ చిత్రం 'బేబి' రెండూ హిట్లే?

    జ: 2014లో నేను నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. కానీ నా జీవితాన్ని మలుపు తిప్పే చిత్రాల్లో 2014లో నటించాననే నమ్మకం ఉండేది. ఆ నమ్మకం వమ్ముకాలేదు. రెండు చిత్రాలు హిట్త్టె నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 'కాంచన 2' నా నటనకు మంచి మార్కులు వేశాయి. ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలను అందుకుంటాననే నమ్ముతున్నా.

    ఇండస్ట్రీలో స్నేహితులెవరు.?

    ఇండస్ట్రీలో స్నేహితులెవరు.?

    జ: చిత్ర పరిశ్రమలో నాకున్న ఏకైక స్నేహితురాలు మంచు లక్ష్మీ ప్రసన్న. కానీ నా నిజ జీవితంలో సినిమాకు సంబంధం లేని స్నేహితులు చాలా మంది ఉన్నారు.

    పట్టించుకోలేదు

    పట్టించుకోలేదు

    జ: నిజంగా ఈ సినీ జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదేననే విషయాలు తెలుసుకున్నా. ఈ మధ్య కూడా నా గురించి కొన్ని వదంతులు వచ్చాయి. అయినా వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

    పెళ్లి గురించి.?

    పెళ్లి గురించి.?

    జ: అందుకు ఇంకా చాలా సమయం ఉంది. 'ఇక నటించింది చాలు' అనిపించేంత వరకు పెళ్లి గురించి ఆలోచించను. ఎందుకంటే పెళ్లి తర్వాత నటించే ఆలోచన అస్సలు లేదు.

    ప్రాధాన్యత ఉండదు

    ప్రాధాన్యత ఉండదు

    'మన దగ్గర హీరోకున్నంత ప్రాధాన్యం హీరోయిన్లకు ఉండదు. క్యారెక్టర్ వేరియేషన్స్ లోనూ అంతే! హీరోలు కనీసం అప్పుడప్పుడైనా విభిన్న పాత్రలు చేసేవీలుంటుంది. హీరోయిన్లయితే ఎప్పుడూ మూస పాత్రలే!

    మారాలి

    మారాలి


    అయితే కెరీర్ ప్రారంభంలోనే వెరైటీ రోల్స్ తప్ప వేరేవి చేయననడం నాతో సహా ఎవ్వరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ హీరోయిన్ల విషయంలో సినిమా రూపకర్తల ఆలోచన చాలా మారాల్సిఉంది. అఫ్ కోర్స్ అందుకు చాలా కాలం పడుతుందనుకోండి!

    గాడ్ ఫాధర్లు తప్పదు

    గాడ్ ఫాధర్లు తప్పదు

    హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణించాలంటే కావాల్సినవి రెండే రెండు. ఒకటి మంచి సినిమాల ఎంపిక. రెండు కష్టపడి పనిచేయడం. అయినా గాడ్ ఫాదర్లు ఉంటే తప్ప ఈ సినీజగత్తులో ఎవరికెవరు ఏమౌతారో ఎవరికీ ఎరుక ఉండదు

    ప్రక్కనే ఉంటారు...

    ప్రక్కనే ఉంటారు...

    అవకాశాలు వచ్చినాసరే.. ఈ హెవీ కాంపిటీషన్ లో మనల్ని మనం నిలబెట్టుకోవడం అంత సులువేమీకాదు! కామెట్లు చేసేవాళ్లు.. పక్కనేఉంటూ కుంగదీయాలనుకునేవాళ్లు.. ఇలా హార్డిల్స్ దాటుకుంటూ నటిగా రాణించడం ఎంత కష్టమో అనుభవిస్తేగానీ తెలియదు' అంటూ బాధ వెళ్లగక్కింది.

    English summary
    Taapsi talked about Live in Relatin ship, and Kanchana2 movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X