» 

మొదట్లో తెగ బాధపడేదాన్ని: తమన్నా

Posted by:

హైదరాబాద్ :నేను నటించిన సినిమా సరిగా ఆడలేదంటే తెగ బాధపడేదాన్ని మొదట్లో. కోలుకోవడానికి సమయం పడుతుండేది. కానీ, రానురానూ పరిస్థితి మారింది. సినిమా విడుదల అవగానే మన పనైపోయినట్టు ఇక, దాని గురించి ఆలోచించడం మానేస్తాను. కొత్త సినిమాపైకి దృష్టిని మళ్లిస్తాను అని చెప్పింది తమన్నా. రీసెంట్ గా తన బాలీవుడ్ ఎంట్రీ ప్లాప్ అయిన నేపధ్యంలో ఆమె ఇలా స్పందించింది.

అలాగే మొదట్లో.. నేను నటించే సినిమాలో నాకు ఎక్కువ సన్నివేశాలు ఉండాలని అనుకునేదాన్ని. అలా అయితేనే హీరోయిన్‌గా గుర్తింపు వస్తుందని భావించాను. కానీ, సన్నివేశాలు ఎన్ని ఉన్నాయన్నది ముఖ్యం కాదన్న విషయం నెమ్మదిగా అర్థంచేసుకున్నాను. అందుకే కమర్షియల్‌ సినిమాలో నాలుగైదు సీన్లు ఉన్నా చాలు... అది విజయం సాధించాక వచ్చే గుర్తింపే వేరు అంటోంది.

అంతేకాదు...ఒక్కోసారి ఓ మంచి సినిమా నుంచి గొప్ప పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. అలా నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన చిత్రం 'కుంగ్‌ ఫూ పాండా'. ఇప్పటికీ... నాకు మూడ్‌ సరిగా లేనప్పుడు ఈ సినిమా చూస్తాను. అంతే, వెంటనే రీఛార్జ్‌ అయిపోతాను. చూసిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త పాఠం నేర్పిస్తుందీ చిత్రం అంది.

సినిమాల ప్రభావం సమాజంపై ఎంతో ఉంటుందన్నది వాస్తవం. మొదట్లో ఆ ఆలోచనే ఉండేది కాదు. అభిమానులు పెరుగుతున్న కొద్దీ నా బాధ్యత పెరిగింది అన్న పాఠం నేర్చుకున్నాను. అందుకే తెరపై నా పాత్రను చూసి ఎవ్వరూ తలదించుకోకూడదని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా అమ్మాయిలు థియేటర్‌లో కూర్చుని ఎలాంటి ఇబ్బందీ లేకుండా నా సినిమా చూడగలగాలి అని కోరుకుంటున్నాను అంది.


ఇక నా జీవితంలో విజయాలు ఉన్నాయంటే ఆ క్రెడిట్‌ మొత్తం అమ్మదే. అందుకే, అమ్మ ఎప్పుడూ నా వెంటే ఉంటుంది. నా కోసం అమ్మ ఎంతో చేసింది. అందుకే, అమ్మకి చెప్పకుండా ఏ పనీ చేయను. నటిగానే కాకుండా ఒక వ్యక్తిగా ఎలా జీవించాలో కూడా అమ్మ నుంచే నేర్చుకున్నాను అంటూ తమన్నా వివరించింది.

Read more about: tadakha, tamanna, rachcha, తమన్నా, తడాఖా, హిమ్మత్ వాలా
English summary
Tamanna says that her first days she is very sad when her film flop at Box Office.
Please Wait while comments are loading...