»   » 'బాహుబలి-2' :తమన్నా డెడికేషన్ చూస్తూంటే ముచ్చటేయటం లేదూ

'బాహుబలి-2' :తమన్నా డెడికేషన్ చూస్తూంటే ముచ్చటేయటం లేదూ

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కెరీర్ ని మలుచుకోవటంలో నేటి తరం హీరోయిన్స్ తమదైన శైలిలో ఎంత కష్టానికైనా సిద్దపడుతున్నారు. ముఖ్యంగా తమకు పేరు తెచ్చి పెట్టి, కెరీర్ ని మరింత ముందుకు తీసుకువెళ్లే ..బాహుబలి వంటి ప్రాజెక్టుల కోసమైతే మరీను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటారా...

బాహుబలి 2 లో క్లైమాక్స్ సీన్స్ లో పాల్గొనేందుకు తమన్నా గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. ముంబైలో తన ఇంటి వద్ద ఉన్న ఆమె అక్కడ హార్స్ క్లబ్ కు వెళ్లి గుర్రం స్వారిలో ట్రైనింగ్ తీసుకుంటోంది. సీన్స్ మరింత అద్బుతంగా,నాచురల్ గా రావటం కోసం రాజమౌళి ఈ సలహా ఇచ్చారని తెలుస్తోంది.

Tamanna

ఇక ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. ''బాహుబలి షూటింగ్‌ కోసం నా కొత్త ఫ్రెండ్‌ పూజ అనే గుర్రంపై స్వారీ నేర్చుకుంటున్నా. షి ఈజ్‌ బ్యూటీ'' అని ఆ గుర్రంతో ఉన్న ఫొటో సహా పోస్ట్‌ చేసింది తమన్నా.

Meet my new friend #poojathehorse #horseriding lessons @baahubalimovie , she's a beauty 😍😍😍😍

A photo posted by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

ఇదే విషయాన్ని... 'నా కొత్త ఫ్రెండ్ పూజ. బాహుబలి చిత్రం కోసం గుర్రపుస్వారీ పాఠాలు. ఆమె(గుర్రం) అందంగా ఉంది' అని ట్వీట్‌ చేశారు.

'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రం గత ఏడాది జులై 10న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక 'బాహుబలి' సీక్వెల్‌ 'బాహుబలి: ద కన్‌క్లూజన్' షూటింగ్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. అనుష్క, రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 13న పతాక సన్నివేశాల చిత్రీకరణ పది వారాల పాటు ఏకధాటిగా జరగనుంది.

విజయేంద్రప్రసాద్‌ కథ, కీరవాణి సంగీతం, సెంథిల్‌కుమార్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
currently Tamanna is resting at her home in Mumbai. In the mean time she's practicing horse riding at a club such that it will be helpful for her during "Baahubali 2" climax shoot.
Please Wait while comments are loading...