» 

‘హృదయ కాలేయం’: తమ్మారెడ్డి సీరియస్ వార్నింగ్

Posted by:

హైదరాబాద్ : ఇటీవలే విడుదలైన 'హృదయ కాలేయం' చిత్రం దర్శకుడు స్టీవెన్ శంకర్, హీరో సంపూర్ణేష్‌బాబులపై కొందరు తెలంగాణ వాదుల దాడిని ఖండిస్తూ దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 'తెలంగాణలో కోటిన్నరమంది. సెటిలర్స్ ఉన్నారు. వాళ్లకు గనుక కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. తెలంగాణ వాదులు అక్కడి దాకా తెచ్చుకోవద్దు'' అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ హెచ్చరించారు.

తమ్మారెడ్డి మాట్లాడుతూ... ''తెలంగాణ వ్యక్తిని హీరోగా పెట్టి వ్యంగ్యంతో కూడిన కామెడీ సినిమా తీస్తావా? అని స్టీవెన్ శంకర్‌ని కొట్టడం సబబైన పని కాదు. తెలంగాణ వాడైన సంపూర్ణేష్‌బాబుకి ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటప్పుడు దర్శకుడు స్టీవెన్‌శంకర్‌ని అభినందించాలి కానీ... కొట్టడం ఎంతవరకు సమంజసం. మరోసారి సినిమావాళ్ల మీదకొస్తే... చూస్తూ ఊరుకోం. అన్ని రాజకీయ పార్టీలూ ఈ దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే... భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని భయం వేస్తోంది. సినిమాలకు ప్రాంతాలతో సంబంధం లేదు. అన్ని ప్రాంతాలూ సినిమాకు సమానమే. తెలుగువారందరూ అన్నదమ్ముల్లా సామరస్యంగా ఉండాలనేది మా అభిమతం'' అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్.

'హృదయ కాలెయం' చిత్రం హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకులు స్టీవెన్ శంకర్‌లపై మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్‌లో దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఓ థియేటర్‌లో హృదయ కాలెయం సినిమా చూసిన తర్వాత చిత్రం విజయవంతమైందని, ఆ సంతోషంతో ఓ హోటల్‌లో చిత్రం యూనిట్ సభ్యులు పార్టీ చేసుకుంటున్నప్పుడు సాఫ్ట్‌వేర్‌కు చెందిన కొంత మంది యువకులతో ఈ వివాదం మొదలైంది.

ఈ రెండు వర్గాలు మధ్య మాటా మాట పెరిగి, ఎవరిని పడితే వారిని హీరో చేస్తారా? హీరో అంటే కొన్ని లక్షణాలు, అర్హతలు ఉండక్కర్లేదా? అంటూ... ప్రతివాడూ హీరో అయిపోతున్నాడని మద్యం మత్తులో ఉన్న యువకులు డైరెక్టర్ స్టీవెన్ శంకర్‌పై దాడి చేశారు. అడ్డుకోబోయిన హీరో సంపూర్ణేష్ బాబుపై కూడా దాడి చేశారు. శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే యువకులంతా ప్రముఖుల పిల్లలు కావడంతో కేసు నమోదు చేయకుండా రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం వరకు చర్చలు జరిగినట్లు తెలియవచ్చింది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ప్రస్తుతం స్టీవెన్ శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంపూర్ణేష్ బాబుకు స్వల్పగాయాలయ్యాయి.

ఎస్సై రంజిత్ కుమార్ కథనం ప్రకారం...హృదయ కాలేయం నిర్మాత సాయి రాజేష్, మరో ఆరుగురు వ్యక్తులు వెస్టిన్ హోటల్ లో బస చేసారు.
ఆ సమయంలో బంజారాహిల్స్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి మనోజ్ (29) మద్యం సేవించి అదే హోటల్‌లో బస చేశాడు. కాగా, తెల్లవారుజామున 3 గంటలకు బాత్రూమ్‌కు వెళ్లిన మనోజ్ అక్కడే ఉన్న సాయిరాజేశ్‌పై తాగిన మత్తులో దుర్భాషాలాడాడు.

సినిమా డైలాగులతో జనాన్ని చంపుతున్నావంటూ వ్యంగ్యంగా మాట్లాడడమే కాకుండా సాయిరాజేశ్‌పై దాడిచేయడంతో ఆయన ముక్కుకు తీవ్ర గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందుతుడు మనోజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more about: tollywood, hrudaya kaleyam, sampoornesh babu, టాలీవుడ్, హృదయ కాలేయం, సంపూర్ణేష్ బాబు
English summary
‘Hridaya Kaleyam’ Steven Shankar was attacked by a youth in Hyderabad in the wee hours of Sunday. According to reports, one Manoj attacked Steven Shankar near Kukatpally. Later, the director lodged a complaint with Madhapur police and they took Manoj into their custody.
Please Wait while comments are loading...