twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ వైపు సంక్రాంతి విన్నర్ ఎవరంటూ చర్చ.... శాతకర్ణి వైపే మొగ్గు!

    సంక్రాంతి విన్నర్ ఎవరూ అంటూ ఆసక్తికరంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో...చిరంజీవి 150వ సినిమా, బాలయ్య 100వ సినిమాపై తమ్మారెడ్డి తనదైన రీతిలో స్పందించారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ సారి సంక్రాంతి బాక్సాఫీసు రేసు గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా సాగుతోంచి. మెగాస్టార్ చిరంజీవి 150తో రీ ఎంట్రీ ఇస్తూ 'ఖైదీ నెం 150' సినిమాతో రాగా, బాలయ్య తన 100వ సినిమాతో తెలుగుజాతి చరిత్ర అంటూ రంగంలోకి దిగారు. ఈ రెండు సినిమాలకు భిన్నమైన ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'శతమానం భవతి' చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు విడుదల చేసారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో సంక్రాంతి రేసులో విన్నర్ ఎవరూ అంటూ ఆసక్తికరంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో... దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. చిరంజీవి 150వ సినిమా, బాలయ్య 100వ సినిమాపై తమ్మారెడ్డి తనదైన రీతిలో స్పందించారు.

    చిరంజీవి సినిమా ఇంకా బాగా తీయాల్సింది

    చిరంజీవి సినిమా ఇంకా బాగా తీయాల్సింది

    చిరంజీవి గారు పదేళ్ల తర్వాత వచ్చారు. అమ్మడు కుమ్ముడు....రత్తాలు బొత్తాలు అంటూ కలెక్షన్స్ కుమ్మేస్తున్నారు. ఆయన్ను చూసిన ఫ్యాన్స్ కి కన్నుల పండగే అయిపోయింది. నా వరకు అయితే ఆ సినిమాలో ఉన్న ఉదార్తమైన సీన్స్ బావున్నాయి. క్లైమాక్స్ ఇంకా బాగా ఉండి ఉంటే సినిమా ఇంకా బావుండేదేమో అని నాకు అనిపిస్తోంది. అది కత్తి అని చెప్పకుండా తీసి ఉంటే దానికంటే గొప్ప సినిమా లేదు. కత్తి అని చెప్పారు కాబట్టి కత్తి సినిమాలో లాగా కొన్ని సీన్లు పెట్టి ఉంటే బావుండేది. క్లైమాక్స్, పినిషింగ్ సీన్స్ ఉంటే బావుండేది అనిపించింది తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

    నేను కరెక్టో... ప్రజలు కరెక్టో తెలియదు

    నేను కరెక్టో... ప్రజలు కరెక్టో తెలియదు

    ఖైదీ నెం 150 కానీ కలెక్షన్ల సునామీ చేస్తోంది కాబట్టి నేను కరెక్టో... చూస్తున్న ప్రజలు కరెక్టో తెలియదు. ఏది ఏమైనా చిరంజీవి గారు చిరంజీవిగారే అని రుజువైంది. కానీ చిరంజీవిగారు మెరాకిల్ చేయగలరు. చిరంజీవి గారికి ఈ రెవెన్యూ చాలదు. ఆయన స్థాయికి ఇంకా రెవెన్యూ రావాలి. ఆయన చేయగలరు. సమాజానికి పనికొచ్చే కథ కత్తి కూడా. అలాంటి సినిమాను ఇంకా బాగా ఆవిష్కరించి ఉంటే బావుండేది. ఇంకా పెద్ద హిట్టయ్యేదని నా అభిప్రాయం అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

    తెలుగు సినిమాను ఒక లెవల్ కు తీసుకెళ్లిన సినిమా శాతకర్ణి

    తెలుగు సినిమాను ఒక లెవల్ కు తీసుకెళ్లిన సినిమా శాతకర్ణి

    బాలకృష్ణ గారి సినిమా ట్రైలర్ చూడగానే అనుకున్నాం అద్భుతంగా ఉంటుందని, అనుకున్నదానికంటే కూడా బావుంది. బాలకృష్ణ గారి సినిమాల్లో ఎక్కువ రెవెన్యూ చేసిన సినిమా ఇదే అవుతుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఇంత షార్ట్ టైమ్ లో టెక్నికల్ గా పర్ ఫెక్ట్ గా చేసిన మొదటి సినిమా కూడా ఇదే అవుతుంది. బాహుబలి అంత కాస్ట్ తో తీసినా... ఆ సినిమాతో కంపేర్ చేసే లెవల్ కి ఈ సినిమా వచ్చింది. దాంతో కంపేరిజన్ కాదు కానీ అది జానపద కథ, ఇది చరిత్రను జానపదం చేసిన కథ. దాన్ని దీన్ని కలిపి మనం మాట్లాడుకోలేం. బాలయ్య పెర్ఫార్మెన్స్ గానీ, సాయి మాధవ్ గారి డైలాగులు కానీ క్రిష్ గారి డైరెక్షన్ కానీ కెమెరామెన్ పనితనం గానీ ఇవన్నీ చూసుకుంటే తెలుగు సినిమాను ఒక లెవల్ కు తీసుకెళ్లిన సినిమా శాతకర్ణి అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

    శతమానం భవతి గురించి

    శతమానం భవతి గురించి

    శతమానం భవతి సినిమా సరదాగా ఉంది, బావుంది. అంతకు ముందు సీతారామయ్య గారి మనవరాలు, ఇంకా చాలా సినిమాల్లో ఇలాంటివి చూసాం. ఫారన్ నుండి పిల్లలు రాక పోవడం, తల్లిదండ్రులు ఒంటరిగా ఉండటం లాంటివి చూపించారు. కానీ ఇపుడు పిల్లలు అమెరికా నుండి అయినా తల్లిదండ్రులను చూడటానికి వస్తున్నాకు కానీ... హైదరాబాద్ లోనే చైతన్య పురి నుండి బిహెచ్ఇఎల్ లాంటి ప్లేసులకు తల్లిదండ్రులను చూడటానికి పిల్లలు రావడం. శతమానం భవతి మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అన్నారు తమ్మారెడ్డి.

    తమ్మారెడ్డి వీడియో

    సంక్రాంతి సినిమాలపై తమ్మారెడ్డి కామెంట్ పూర్తి వీడియో ......

    English summary
    Tollywood Veteran Director Tammareddy Bharadwaj speaks about Latest Telugu Movies Chiranjeevi's Khaidi No 150, Balakrishna's Gautamiputra Satakarni & Shatamanam Bhavati movies. He responds on each movie & he shares his review. Finally, he concludes that this Sankranti became a feast for Telugu People and Telugu Film Industry with Good Box-Office Collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X