twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతార, శింబు ప్రేమ వ్యవహారంలో....వేలు పెడుతున్న తాప్సీ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చాలా కాలం తర్వాత తన మాజీ ప్రియుడు శింబుతో కలిసి ఓ తమిళ సినిమాలో నటిస్తోంది నయనతా. ఈ చిత్రానికి పాండి రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రంలో వీరు ప్రేమికులుగా కనిపించనున్నారు. ఇందులో వీరు పెద్దలను ఎదురించి రహస్యంగా పెళ్లి చేసుకుంటారు. ఇదంతా సినిమా కథలో భాగమే. అంతే కాదండోయ్...ఇద్దరి మధ్య ఘాటైన శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయట.

    ఏది ఏమైనా ఈ మాజీ ప్రేమికులు ఒకప్పుడు రియల్ లైఫ్‌లో చేసిన పనులు, చేయాలనుకున్న పనులు....ఇపుడు రీల్ లైఫ్‌లో చేస్తుండటం చర్చనీయాంశం అయింది. వీరు నటించే ఈ తమిళ చిత్రానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. కాగా...ఈ చిత్రంలో తాప్సీ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని....వారిద్దరి ప్రేమకు, తాప్సీకి పాత్రకు లింక్ ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

    Tapsi in Pandiraj movie

    నయనతార, శింబు మధ్య గతంలో ఘాటైన ప్రేమాయణం సాగిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరు పెళ్లి చేసుకుంటారా? లేదా? ఒక వేళ చేసుకుంటే ఎలా చేసుకుంటారు? రహస్యంగా ప్రేమ వివాహమా? పెద్దలను ఒప్పించి చేసుకుంటారా? అంటూ చాలా గాసిప్ వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

    ఆ తర్వాత శింబు, నయనతార విడిపోవడం తెలిసిందే. శింబుతో విడిపోయిన తర్వాత నయనతార, ప్రభుదేవా మధ్య కొంత కాలం ప్రేమాయణం సాగింది. ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా విడిపోయింది ఈ కేరళ బ్యూటీ. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్న నయనతారన సినిమాలపై దృష్టి సారించింది.

    English summary
    Actress Nayanthara Ex Boy friend Young Superstar Simbu, trying to make her as female lead in the upcoming movie. This film is also being dubbed simultaneously into Telugu as well. Director of this movie, Pandiraj, added a new flavour to this buzz by announcing that Tapsee will be featuring in another crucial role in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X