» 

నందమూరి హీరో సినిమాకు పోలీసుల బ్రేక్..

Posted by:

హైదరాబాద్: నందమూరి మూరి హీరో తారకరత్న సినిమాకు పోలీసులు బ్రేక్ వేసారు. తారక రత్న నటిస్తున్న 'ఎదురు లేని అలెగ్జాండర్' చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ ఏరియా శంకర్ పల్లిలో జరుగుతోంది. అయితే ముందస్తు అనుమతి లేకుండా షూటింగ్ జరుపుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు.

అనుమతి లేకుండా షూటింగులు నిర్వహిస్తుండటంతో ఇటీవల పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా జరుగుతున్న షూటింగులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. షూటింగుల సమయంలో అనుమతి తప్పని సరని, తమ విధి నిర్వహణలో భాగంగానే సినిమాను అడ్డుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సినిమా వివరాల్లోకి వెళితే...
'ఎదురులేని అలెగ్జాండర్' చిత్రం ఇటీవలే రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకుంది. పోచా సాహితి ధనుష్ రెడ్డి సమర్పణలో పి.ఎల్.కె.రెడ్డి నిర్మిస్తున్న ఈచిత్రంలో కుంకుమ్ అనే కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో తారకరత్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో తారకరత్న, కుంకుమ్ తో పాటు రవిబాబు, విజయ్, ఉదయ్ తేజ, ఎ.వి.ఎస్, కొండవలస, రామకృష్ణ, సురేష్ తదితరులు నటిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు: చింతా శ్రీనివాస్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, చింతా శ్రీనివాస్, ఆర్ట్: భాస్కర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: తోట రమణ, సంగీతం: జోష్యభట్ల శర్మ.

Read more about: tarakaratna, eduruleni alexander, తారకరత్న, ఎదురులేని అలెగ్జాండర్
English summary
Actor Nandamuri Tarakaratna's new film 'Eduruleni Alexander' shooting has been stopped by Rajendra Nagar Police.
Please Wait while comments are loading...