»   » నాకు ఎదురు లేదంటూ.. తారకరత్న మరో సినిమా!

నాకు ఎదురు లేదంటూ.. తారకరత్న మరో సినిమా!

Posted by:

హైదరాబాద్: సినిమాల మీద సినిమాల్లో నటిస్తూ తెగ బిజీ అయిన నందమూరి ప్లాప్ హీరో తారకరత్న హీరోగా మరో సినిమా మొదలైంది. ఈ సినిమా పేరు 'ఎదురు లేని అలెగ్జాండర్'. పానుగంటి రాజారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రం సోమవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది.

తొలి సన్నివేశానికి ప్రసన్న కుమార్ క్లాప్ ఇవ్వగా, బసిరెడ్డి కెమెరా స్విచాన్ చేసారు. సాగర్ తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. పోచా సాహితి ధనుష్ రెడ్డి సమర్పణలో పి.ఎల్.కె.రెడ్డి నిర్మిస్తున్న ఈచిత్రంలో కుంకుమ్ అనే కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది.

దర్శకుడు మాట్లాడుతూ...ఈ చిత్రంలో తారకరత్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని, ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేసారు. నిర్మాత పి.ఎల్.కె.రెడ్డి మాట్లాడుతూ సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ చిత్రంలో తారకరత్న, కుంకుమ్ తో పాటు రవిబాబు, విజయ్, ఉదయ్ తేజ, ఎ.వి.ఎస్, కొండవలస, రామకృష్ణ, సురేష్ తదితరులు నటిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు: చింతా శ్రీనివాస్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, చింతా శ్రీనివాస్, ఆర్ట్: భాస్కర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: తోట రమణ, సంగీతం: జోష్యభట్ల శర్మ.

English summary
Nandamuri hero Tarakaratna new film 'Eduruleni Alexander' launched today at Rama naidu studio. Panuganti Rajareddy direct this film.
Please Wait while comments are loading...