twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనొక టిబి రోగిని: షాకింగ్ సీక్రెట్ బయట పెట్టిన మెగాస్టార్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయట పెట్టారు. కొన్ని రోజుల క్రితం వరకు తాను టీవీ(క్షయ వ్యాధి)తో బాధ పడ్డానని...అయితే ప్రస్తుతం తాను దాని నుండి పూర్తిగా బయట పడ్డానని అమితాబ్ బచ్చన్ స్పష్టం చేసారు. అమితాబ్ నుండి ఈ ప్రకటన విని అభిమానులు తొలతు అభిమానులు షాకైనా...తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నారనే విషయం తెలిసి కోలుకున్నారు.

    అయితే ఇన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన అమితాబ్.... ఇపుడు బయట పెట్టడానికి ఓ కారణం ఉంది. టిబి వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించాలని అమితాబ్ నిర్ణయించుకున్నారు. నేను టిబి వ్యాధి నుండి సురక్షితంగా బయట పడ్డాను. త్వరలో భారత్ పూర్తిగా ఈ వ్యాధి నుండి బయట పడుతుంది అని ఆశావం వ్యక్తం చేసారు. ప్రపంచ ట్యూబర్‌కులోసిస్(టిబి) దినోత్సవం సందర్భంగా త్వరలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో అమితాబ్ పాలుపంచుకోబోతున్నారు.

    TB survivor Amitabh Bachchan: During KBC, I was in immense pain

    నాకు 2000 సంవత్సరంలో టిబి సోకింది. దాదాపు సంవత్సరం పాటు చికిత్స తీసుకున్నాను. వెన్నముఖతో సంబంధం ఉన్న టిబి కావడంతో కూర్చున్నపుడు చాలా పెయిన్ అనిపించేది. ఆ సమయంలో కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో ఉన్నాను. గేమ్ షో సమయంలో రోజుకు దాదాపు 10 పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని అన్నారు.

    ఈ వ్యాధి నుండి సురక్షితంగా బయటపడ్డాను కాబట్టి...నేను అవకగాహన కల్పించడం ద్వారా ఆ వ్యాధితో బాధపడుతున్న వారికి మనోధైర్యాన్ని కల్పిస్తుంది. ఇపుడు నేను పూర్తిగా కోలుకున్నాను. త్వరలో భారత్ కూడా పూర్తిగా కోలుకుంటుంది.

    English summary
    “I am a tuberculosis survivor” and that is why “I took up” the cause of spreading awareness about the disease, Big B said ahead of World Tuberculosis Day on Monday. “Many people ask me why I contribute my services to medical cause. I have had a complicated medical history. One of the reasons I took up TB is because I am a TB survivor.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X