twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో 5వేల థియేటర్లు: ప్రేక్షకులకు లాభమేనంట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాను బ్రతికించడానికి తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఐదు వేల మినీ డిజిటల్ థియేటర్లను నిర్మించడానికి పూనుకుంది. ప్రజల వద్దకే పాలన లాగా ప్రజల వద్దకే సినిమా ప్రదర్శన అనే నినాదంతో తక్కువ కెపాసిటీ గల థియేటర్ల నిర్మాణము కొరకు పిలుపునిచ్చింది.

    గురువారం ఫిలిం ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమానికి...ఊహించని రీతిలో డిజిటల్ థియేటర్ల నిర్మాణం పట్ల మక్కువ ఉన్న వారు వచ్చారు. అరగంట వ్యవధిలోనే 999 దరఖాస్తులు అయిపోయాయి. అక్కడికి వచ్చిన సినిమా ప్రేమికులు ఈ థియేటర్ల నిర్మాణం గురించి తెలుగు సినిమా పరిరక్షణ సమితి ఆధ్యక్షుడు చదవాడ శ్రీనివాసరావు ను అడిగి వివరాలు తెలుసుకుని తమ సంతృప్తిని వ్యక్తం చేసారు.

    మినీ డిజిటల్ థియేటర్ల గురించి చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ....వెయ్యి చదరపు అడుగుల నుండి నాలుగు వేల చదరపు అడుగుల వరకు ఉన్న స్థలంలో 50 నుండి 350 మంది కూర్చోవడానికి సరిపడ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లను నిర్మించడం వల్ల ప్రజల వద్దకు సినిమా వెలుతుంది. అటు సినిమా తీసే నిర్మాతతో పాటు సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా ఇది లాభదాయకంగా ఉంటుంది అన్నారు.

    TCCPS setting up mini theatres

    ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిర్మాతకు సినిమా తీసిన తరువాత విడుదల చేసి సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లినా థియేటర్ రెంటల్, లీజు విధానం వల్ల ఓ మోస్తరుగా సినిమా ఆడినా కూడా నిర్మాతకు రూపాయి డబ్బులు రావడం లేదు. అయితే ఈ డిజిటల్ మినీ థియేటర్ల వల్ల నిర్మాతకు థియేటర్ ఓనర్ కు మంచి లాభాలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న విధానంలో 30 శాతం థియేటర్ నిండినా కూడా థియేటర్ అద్దె తిరిగి నిర్మాతే కట్టుకోవలసిన పరిస్థితి ఉంది.

    ఇపుడు ఈ మనీ డిజిటల్ థియేటర్లలో అదే 30 శాతం థియేటర్ కు వచ్చినా కూడా నిర్మాతకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. ప్రేక్షకులు కూడా తక్కువ వ్యయంతో కుటుంబ సమేతంగా సినిమా చూసే అవకాశం ఉంటుంది. అలాగే క్యాంటీన్ లో అమ్మే తినుబండారాలు, శీతల పానీయాలు మామూలు ధరలకే అందుబాటులో ఉంటాయి. వ్యవస్థ మొత్తం ఆన్ లైన్ టికెటింగ్ మీద ఉంటుంది కాబట్టి ఎన్ని టికెట్స్ అమ్ముడు పోయాయి అనేది..టాక్స్ రూపేణా ప్రభుత్వానికి సినిమా తీసిన నిర్మాతకు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

    దీని వల్ల తక్కువ బడ్జెట్ సినిమాల సంఖ్య ఎక్కువగా రావడానికి అవకాశాలు ఏర్పడుతాయి. సినిమాల నిర్మాణ సంఖ్య పెరగడమే కాకుండా మంచి మంచి సినిమాలు వచ్చే అవకావం ఉంది. అలాగే సినిమా పరిశ్రమను నమ్ముకున్న చిన్న పాటి నటీనటులు, సాంకేతిక నిపుణులకు, లక్షలాది మంది కార్మికులకు...చేతినిండా పని దొరుకుతుంది. ఈ మినీ డిజిటల్ థియేటర్ల వలన ఇన్ని లాభాలు కలగడం వల్ల మేము దీన్ని మా చలన చిత్ర పరిరక్షణ సమితి ద్వారా కో ఆపరేటివ్ వ్యవస్థలో నడపడానికి నిర్ణయం తీసుకున్నాము. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

    English summary
    Telugu Chalana Chitra Parirakshana Samithi setting up mini theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X