twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనం నీచం అన్న ఆలోచన మార్చేశారు: బాహుబలి రాజమౌళికి టెక్కీ ఓపెన్ లెటర్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-2' వెయ్యికోట్ల వసూళ్లతో బాక్సాఫీసు వద్ద సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను ఈ చిత్రం వద్దలు కొట్టి నెం.1గా అవతరించింది.

    కాగా... ఈ సినిమా, రాజమౌళి గురించి ప్రకాష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాసిన ఓపెన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ లెటర్ చదివిన ప్రతి ఒక్కరూ.... ఆయన పేర్కొన్న పాయింట్స్ ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు.

    ఇంతకీ ఆ లెటర్ లో ప్రకాష్ ఏం రాసాడు? అనే పాయింట్లపై ఓ లుక్కేద్దాం...

    బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత

    బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత

    ‘మీ బాహుబలి - ది కన్‌క్లూజన్ సినిమా విడుదలతో భారతీయ సినీ ఇండస్ట్రీలో స‌రికొత్త చ‌రిత్ర‌ మొదలైంది. ఇక ఇప్ప‌టినుంచి ‘బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత' అంటూ భారతీయ సినిమా రెండు భాగాలుగా విడిపోయిందని పేర్కొన్నాడు.

    బాలీవుడ్ ఖాన్ ల గుండెల్లో రైళ్లు

    బాలీవుడ్ ఖాన్ ల గుండెల్లో రైళ్లు

    కేవలం ఐదు రోజుల్లోపే 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ ఖాన్‌ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది బాహుబలి 2. అంతేకాదు కోలీవుడ్‌లో సైతం సూప‌ర్‌స్టార్ రజ‌నీకాంత్ రికార్డులనూ కనుమరుగు చేస్తోందని పేర్కొన్నారు.

    సూడో లిబరల్స్ ను గట్టి దెబ్బ కొట్టారు

    సూడో లిబరల్స్ ను గట్టి దెబ్బ కొట్టారు

    హిందీ/తమిళ్‌లోకి డబ్బైన ఓ తెలుగు మూవీ అక్కడి టాప్ స్టార్ హీరోల సినిమాలను వెనక్కు నెట్టడమంటే మాటలు చెప్పినంత సులువు కాదు. దానిని మీరు సాధించారు. నిజానికి మీరు హీరోలకు సవాల్ విసరలేదు. సూడో లిబరల్స్ ను గట్టి దెబ్బ కొట్టారు అని చెప్పుకొచ్చారు.

    నీచం అన్న ఆలోచన మార్చేశాయి

    నీచం అన్న ఆలోచన మార్చేశాయి

    మీరు సినిమాతో మన సంస్కృతి, చరిత్రపై హిందువుగా భావించే ప్రతి సామాన్య వ్యక్తిలో ఉన్న ఆలోచనను పూర్తిగా మార్చేశారు. ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మన చరిత్ర, సంస్కృతికి వక్ర భాష్యం చెప్పాయి. అంతేకాదు చాలా సందర్బాల్లో తప్పుడు సిద్ధాంతాలతో మన సంస్కృతి అంటేనే నీచం అన్నంతగా చాలామంది ఆలోచ‌న‌లు మార్చేశాయి. మన సంస్కృతి, చరిత్రపై ఉన్న ఊహాగానాలు, అనుమానాలన్నింటినీ మీరు బాహుబలి 2తో పటాపంచలు చేసేశారు. భార‌తీయ సంస్కృతి ఔన్న‌త్యం ఏమిటో ధ‌ర్మానికి మ‌న సంస్కృతిలో ఉన్న ప్రాధాన్య‌మేమిటో, అన్యాయానికి చివ‌రికి ల‌భించే ప్ర‌తిఫ‌ల‌మేమిటో మీరు ఈ సినిమాద్వారా మ‌రోసారి గొప్ప‌గా తెలియ‌జేశారు అని ప్రశంసించారు.

    బాహుబలి 2 పెద్ద దెబ్బే

    బాహుబలి 2 పెద్ద దెబ్బే

    దక్షిణాది రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తమిళనాడు.. ఆర్య - ద్రవిడ సంస్కృతినే అనుసరిస్తోంది. తొలి సీన్లో వినాయకుడిని ఆరాధించడం, దసరా ఉత్సవాల్లో ఏనుగులను చూపించడం వంటి సీన్లతో తప్పుడు ఆర్యుల వలస సిద్ధాంతాన్ని కొట్టిపారేశారు. రాముడు, శివుడిని పూజించడమే భారతదేశ సంస్కృతి. ద్రవిడులకు రావణుడే దేవుడని కొంత మంది అంటారు. కానీ, అది కూడా వారి రాజకీయ స్వలాభాల కోసమే. ఆర్యులు, ద్రవిడులు సృష్టించిన ఈ ఫేక్ దేవుళ్లు తమ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని భావించిన వాళ్లకు బాహుబలి 2 పెద్ద దెబ్బే..'

    English summary
    "With collections grossing well over Rs 700 crores in the past five days, this movie will create a big dent to all the Khan glory of Bollywood or a Rajini block buster of Kollywood" Techie open letter to Rajamouli about Baahubali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X