twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫాలెన్ విల్ రైజ్: దుమ్మురేపుతున్న ట్రైలర్, తేజా మళ్ళీ నిలబడతాడా?

    ఒక్క రోజులోనే అయిదు మిలియన్‌ డిజిటల్‌ వ్యూస్‌తో ఈ ట్రెయిలర్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. అసలు ఎక్కడా తన పాత మార్కు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు తేజా.

    |

    తేజా పదిహేనేళ్ళ కిందట ఒక సంచలనం. మూడు వరుస హిట్లతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసాడు, ఉదయ్ కిరణ్, నితిన్ లాంటి డెబ్యూ హీరోలను కూడా ఒకే ఒక్క సినిమాతో ఓవర్నైట్ స్టార్ డమ్ తీసుకొచ్చి ఇండస్ట్రీలో నిలబెట్టాడు. అయితే జయం తర్వాతనుండీ జయం హేంగోవర్‌లోంచి బయటకి రాలేక, మరో హిట్‌ తీయడం ఎలాగో అంతుచిక్కక వరుస ఫ్లాపుల్లో మునిగిపోయి ఖాళీగా ఉన్న తేజా అప్పుడే 'నేనే రాజు నేనే మంత్రి'కి కథ రాసుకున్నాడు.

    అట్టర్ ఫ్లాప్

    అట్టర్ ఫ్లాప్

    కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. నితిన్ తో తీసిన "ధైర్యం" కూడా అట్టర్ ఫ్లాప్ అని తెలియగానే తేజా తో కలిసి పని చేయటానికి మిగతా హీరోలెవరికీ ధైర్యం చాలలేదు. ఆ తర్వాత ఈ కథని పక్కన పెట్టి మళ్ళీ తన పాత ఫార్ముల ప్రకారం కొత్త నటులతో మళ్ళీ సినిమాలు తీసే ప్రయత్నం చేసాడు గానీ వచ్చిన సినిమా వచ్చినట్టు డిజాస్టర్ గా మారిపోయింది.

    హోరాహోరీ

    హోరాహోరీ

    2015 లో ‘హోరాహోరీ' తో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న తేజ, అందుకు షార్ట్ కట్స్ ఎంచుకున్నాడు. తన టేకింగ్ తో, తనదైన స్టోరీ లైన్ తో టీజర్ రిలీజ్ చేసి మంచి హైప్ తెచ్చుకోవాల్సింది పోయి, వివాదాల ద్వారా సినిమా కి ప్రచారం తెద్దామని ట్రై చేసాడు.

    బాబుగారు కథ, బకరా కథ

    బాబుగారు కథ, బకరా కథ

    తెలుగు లో గత పదేళ్లుగా రెండే రెండు కథల్ని తిప్పి తిప్పి తీస్తున్నారని, తాను ప్రేమ కథలని మళ్ళీ మళ్ళీ తీస్తే తప్పేంటి అని మీడియా ని ప్రశ్నించారు. "ఒకటి బాబుగారు కథ, ఇంకోటి బకరా కథ".. ఈ రెండు కాన్సెప్ట్స్ తోనే సినిమాలు వస్తున్నాయని తేజ విమర్శించాడు.

    ఫిల్మ్ మేకర్ అయిఉండి

    ఫిల్మ్ మేకర్ అయిఉండి

    తేజ ఓ ఫిల్మ్ క్రిటిక్ అయిఉంటే ఈ వ్యాఖ్యలని తప్పుపట్టాల్సిన పనిలేదు.. తను స్వయంగా ఫిల్మ్ మేకర్ అయిఉండి, తోటి దర్శకులని అవమానించేలా మాట్లాడాడు. ఇలా మాట్లాడటానికి కారణం కుళ్ళుబోతుతనం తప్ప, ఎలాగోలా తన సినిమా నలుగురి నోళ్ళలో నానాలనే తపన తప్ప పసలేదు. అన్న విమర్శలు తప్ప ఆ వివాదం వల్ల కూడా తేజా కి వచ్చిన లాభం ఏదీ లేదు. ఎన్ని చేసినా "హోరా హోరీ" పోరాడకుండానే థియేటర్లనుంచి పారిపోయింది.

    అటోఇటో తేల్చుకోవాలి

    అటోఇటో తేల్చుకోవాలి

    ఇక అటోఇటో తేల్చుకోవాలి అనుకున్నాడేమో మళ్ళీ తన పాత కథని లైన్లోకి తెచ్చే ప్రయత్నం లో భాగంగా తనకి చిరకాల మిత్రుడైన సురేష్‌బాబునే ఒప్పించి రాణా డేట్స్‌ తీసుకున్నాడు. బాహుబలి తర్వాత హీరోగా ఎలాంటి సినిమా చేయాలా అని చూస్తోన్న రాణా ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.

    రాణాని స్టార్‌ని చేసేలా

    రాణాని స్టార్‌ని చేసేలా

    అందరినీ వదిలేసి ఫ్లాప్‌ డైరెక్టర్‌తో ఎందుకు చేస్తున్నాడని అనుకున్నారు. అయితే ఈ చిత్రం ట్రెయిలర్‌ చూసిన తర్వాతే తేజ ఎంత కసిగా ఇది తీస్తున్నాడనేది తెలిసింది. ఫుల్‌ మాస్‌గా కనిపిస్తోన్న ఈ చిత్రం రాణాని స్టార్‌ని చేసేలా కనిపిస్తోంది. తేజ కథ చెప్పటానికి కాల్ చేస్తే కూడా టైమ్‌ ఇవ్వని స్టార్స్‌ అంతా ఇప్పుడు ట్రెయిలర్‌ చూసి షాక్‌ అవుతున్నారు.

    ట్రెయిలర్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా

    ట్రెయిలర్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా

    ఒక్క రోజులోనే అయిదు మిలియన్‌ డిజిటల్‌ వ్యూస్‌తో ఈ ట్రెయిలర్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. అసలు ఎక్కడా తన పాత మార్కు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు తేజా. ఈ సారి నేనేరాజు..... గనక హిట్ అయ్యిందీ అంటే ఇక తేజా మళ్ళీ నిలదొక్కుకున్నట్టే. చూడాలి మరి ఏం జరుగుతుందో.

    English summary
    Tollywood Director Teja Gives Shock to Tollywood with Nene raju nene mantri?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X