» 

'నీకు నాకు డాష్ డాష్' లెంగ్త్ ట్రిమ్ చేసేసారు

Posted by:

కేక డిజాస్టర్ తర్వాత నాలుగేళ్ల విరామం తీసుకుని మరీ తేజ రూపొందించిన 'నీకు నాకు డాష్‌ డాష్‌' మొదటి రోజు మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే అందరూ కొత్త వాళ్ళతో తీసిన ఈ చిత్రం తప్పకుండా ఓ మంచి ఫీల్ గుడ్ చిత్రం అవుతుందని తేజ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ సెకండాఫ్ బాగా ఇబ్బంది పెట్టడంతో జనం అసహం ఫీలయ్యారు. దాంతో ఇప్పుడు సెకండాఫ్ ని ట్రిమ్ చేసినట్లు సమాచారం.

ఈ చిత్రం సెకండాఫ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ లు కొన్ని ట్రిమ్ చేసారు. అలాగే కొన్ని సీన్స్ ని కూడా తీసేసారు. ఈ ట్రిమెడ్ వెర్షన్ ఈ సారి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందని భావిస్తున్నారు. ఓపినింగ్ బాగా తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్స్ లో కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. అయితే సోమవారం నుంచే సమస్య ప్రారంభం అవనుందని వెంటనే ఈ మార్పు చేసారు. యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం వారిని పూర్తి స్ధాయిలో ఆకర్షిస్తుందని దర్శక,నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

ఇక ఈ చిత్రం గురించి తేజ మాట్లాడుతూ.."నీకు నాకు డాష్ డాష్ చిత్రం కోసం యాక్టర్ హంట్ చేశాం. ప్రిన్స్, నందిత అలా ఎంపికైన వాళ్ళే. తెలుగుమ్మాయి తెలుగు సినిమాకు దొరికింది. 'మావూరి డాష్‌గాడు' అనే పాట సినిమా కూడా ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది'' అని అన్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై తేజ తెరకెక్కించిన చిత్రమిది. ఆనంద్‌ప్రసాద్ నిర్మాత. హీరోగా చేసిన ప్రిన్స్ మాట్లాడుతూ "తేజగారితో పనిచేసి చాలా నేర్చుకున్నా. తెరపై సినిమాను చూసినప్పుడు ఎక్కడా తృప్తిగా అనిపించలేదు. క్లేరిటీ గురించిన ఆలోచనలు చుట్టిముట్టాయి. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ చాలా ఇష్టం. పలు సన్నివేశాల్లో నటించడానికి ఆ అనుభవం పనికొచ్చింది'' అని అన్నారు.

"తేజగారి సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. సెట్‌లో ఏ సీన్ తీస్తుంటే అందుకు తగ్గట్టు మూడ్‌ను క్రియేట్ చేస్తారు తేజగారు. ఎక్కడి విషయాలను అక్కడే వదిలేయాలని తేజగారు నేర్పించారు'' అని నందిత చెప్పారు. సంగీత దర్శకుడు యశ్వంత్‌నాగ్ చెబుతూ "తొలి చిత్రం తేజ తెరకెక్కించిన 'నీకు నాకు డాష్ డాష్' కావడం అమితానందంగా ఉంది'' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నేరవి కూడా పాల్గొన్నారు.

Read more about: teja, mahesh babu, nijam, తేజ, మహేష్ బాబు, నిజం
English summary
Teja's latest release 'Neeku Naaku Dash Dash' has been shortened following average reviews and word-of-mouth reports that length of the second half is a problem. As per the latest reports some of the fight sequences and few scenes in the second half have been trimmed in several theatres.
Please Wait while comments are loading...