twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాలిటిక్స్: తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో చీలిక...!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమను కూడా విభజించాలని కొంత మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్' ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తోంది.

    ‘తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్' ఏర్పాటు చేసి సినీ పరిశ్రమను మరింత అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి కెసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా కొత్తగా భారీ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన ఆ మధ్య ప్రకటించారు. అదే సమయంలో చిత్ర పరిశ్రమ హైదరాబాద్ తరలి పోకుండా ఉండేందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు.

    అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' ఇప్పటికే ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఫిల్మ్ మేకర్స్ మధ్య నెలకొన్ని అంతర్గత విబేధాలు, ఈగో వల్లనే ఈ ఆలస్యం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన సినీ ప్రముఖులంతా ఒక్కతాటిపై ఉండటం లేదని, గ్రూఫులు కట్టి రాజకీయాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Telangana film industry inside story

    తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ దర్శకుడు, జైబోలో తెలంగాణ ఫేం ఎన్.శంకర్ ఆ మధ్య ‘తెలంగాణ సినిమా ఫోర్స్' ఏర్పాటు చేసారు. కొత్తగా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టారు. అయితే ఆయన పెట్టిన అర్జీ గత 9 నెలలుగా హోం సెక్రటరీ వద్ద పెండింగులో ఉందట.

    తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు....ఆంధ్ర లో పుట్టి ఇక్కడ ఎగ్జిబిటర్లుగా ఎదిగిన వారిని వెనకేసుకొస్తున్నారని....అర్థికంగా బలవంతులైన వారు తమ ఇన్‌ప్లూయెన్స్ ఉపయోగించి ఫిల్మ్ ఇండస్ట్రీ విభజన అంశం, ‘తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' ఏర్పాటు అంశం ముందుకు సాగకుండా చేస్తున్నారనేది మరికొందరు వాదిస్తున్నారు.

    అయితే తెలుగు సినీ పరిశ్రమ విభన వల్ల నష్టాలే తప్ప లాభాలు ఉండవని, ఒక్కటిగా ఉంటేనే మంచిదని మరికొందరంటున్నారు. బాలీవుడ్ సినీ పరిశ్రమ ముంబై కేంద్రంగా వివిధ రాష్ట్రాలకు విస్తరించినట్లే......తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగా ఉంటే మంచి జరుగుతుందని అంటున్నారు. అయితే ఉమ్మడి పరిశ్రమ వల్ల చిన్న నిర్మాతలకు నష్టం జరుగుతోందని, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు భడా నిర్మాతలు, తెలంగాణ ప్రాంతానికి చెందిన బడా నిర్మాతలు కలిసి కుమ్మక్కై చిన్న సినిమాలను తొక్కేస్తున్నారని చిన్న నిర్మాతల ఆవేదన.

    English summary
    Telangana film industry finds itself divided as stakeholders slug it out for control of the proposed Telangana Film Development Corporation. The infighting among Telangana based filmmakers has caused CM K Chandrasekhar Rao to postpone instituting Telangana Film Development Corporation (TFDC).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X