twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో శ్రీకాంత్‌కు పోలీసుల నుండి లీగల్ నోటీసులు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు హీరో శ్రీకాంత్ కు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుండి లీగల్ నోటీసులు అందాయి. తనే నిర్మాతగా శ్రీకాంత్ 'మెంటల్ పోలీస్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోలీస్ డిపార్టుమెంటు పేరు చెడగొట్టేలా ఉందని అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.గోపిరెడ్డి తన నోటీసుల్లో పేర్కొన్నారు.

    ఈ విషయమై గోపీ రెడ్డి మాట్లాడుతూ...'మెంటల్ పోలీస్ చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరోకు లీగల్ నోటీసులు పంపాము. సమాజంలో పోలీస్ డిపార్టుమెంటు ఎంతో రెస్పాన్సబులిటీగా ఉంటోంది. మా జీవితాలను పనంగా పెట్టి ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం న్యూయార్క్ పోలీసుల స్టాండర్డ్స్ ను అందుకునేలా ఎన్నో మార్పులు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో సినిమాలకు అలాంటి టైటిల్స్ పెట్టడం వల్ల ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయి' అన్నారు.

    Telugu actor Srikanth gets legal notice from cops

    సినిమా వివరాల్లోకి వెళితే...
    శ్రీకాంత్‌ హీరోగా దాసరి అరుణాదేవి, అనగాని ఫిలింస్‌ సమర్పణలో రాజ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎ. సుబ్రమణ్యేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై సంయుక్తంగా రూపొందుతోన్న చిత్రం 'మెంటల్‌ పోలీసు'. కరణం పి. బాబ్జీ దర్శకుడు. ప్రసాద్‌ దాసరి, వివి దుర్గాప్రసాద్‌ అనగాని నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: బుజ్జి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.

    English summary
    The police Officers’ Association on Thursday sent a legal notice to film actor Srikanth for producing a movie called Mental Police. The association’s president Mr. Y. Gopi Reddy told the press that the title of the movie was critical of the police department.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X