»   »  లైవ్ చాట్: మహేష్ బాబు ఆసక్తికర సమాధానాలు

లైవ్ చాట్: మహేష్ బాబు ఆసక్తికర సమాధానాలు

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఫేస్ బుక్ ద్వారా లైవ్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్ అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. మీ దృష్టిలో విజయానికి కొలమానం ఏమిటి అనే ప్రశ్నకు మహేష్ బాబు స్పందిస్తూ... మంచి కథే సినిమా విజయానికి కొలమానం అని సమాధానం ఇచ్చారు.

ఇకా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ బాబు స్పందిస్తూ... శ్రీమంతుడు స్టోరీ విన్నపుడు స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్ స్టోరీ అనిపించింది. హర్ష లాంటి క్యారెక్టర్ గతంలో ఎవరూ చేయలేదనిపించింది అన్నారు. మరో ప్రశ్నకు స్పందిస్తూ శ్రీమంతుడు సినిమాలో తన కూతురు సితారకు రామ రామ సాంగ్ బాగా నచ్చిందని, సినిమాలో నేను చేసినట్లే డాన్స్ చేస్తుంటుంది అన్నారు.


శ్రీమంతుడు సినిమాలో తన ఫేవరెట్ సీన్ గురించి చెబుతూ... ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ జగపతి బాబుతో నాకు బాగా నచ్చిన సీన్ అన్నారు. తన ఫేవరెట్ హీరో ఎప్పటికీ తన తండ్రే అని మహేష్ బాబు స్పష్టం చేసారు. నా సినిమాలో ఆయనకు బాగా నచ్చిన సినిమా ఇపుడు ‘శ్రీమంతుడు' అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మరో ప్రశ్నకు స్పందిస్తూ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమన్నారు. తన ఫేవరెట్ హాలిడే స్పాట్ సింగపూర్ అని మహేష్ బాబు తెలిపారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..


తెలుగు ఫిల్మీబీట్ అడిగిన ప్రశ్నకు

మీ దృష్టిలో విజయానికి కొలమానం ఏమిటి అనే ప్రశ్నకు మహేష్ బాబు స్పందిస్తూ... మంచి కథే సినిమా విజయానికి కొలమానం అని సమాధానం ఇచ్చారు.


మహేష్ బాబుతో లైవ్ చాట్

సితార గురించి అడిగిన ప్రశ్నలకు మహేష్ బాబు సమాధానం ఇచ్చారు.


అవార్డుల గురించి

అవార్డుల గురించి, ఇతర అంశాల గురించి మహేష్ బాబు ఇలా...


నమ్రత, గౌతం

నమ్రత, గౌతం శ్రీమంతుడు చూసిన తర్వాత ఎలా రియార్ట్ అయ్యారు?


చిన్న సినిమాల గురించి

స్క్రిప్టు నచ్చితే చిన్న సినిమాలు కూడా చేయడానికి సిద్దమే అని మహేస్ బాబు తెలిపారు.


సెలబ్రిటీ స్టాటస్

సెలబ్రిటీగా, ఒక స్టార్ గా తాను ఎలా ఫీలవుతున్నాననే విషయాలపై మహేష్ బాబు స్పందించారు.


రివ్యూ..

అభిమానుల రివ్యూలపై మహేష్ బాబు స్పందన ఇలా...


ఇష్టమైన ఆహారం

తనకు ఇష్టమైన ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పారు మహేష్ బాబు.


 


 


English summary
Telugu filmibeat got reply from actor Mahesh Babu on live chat.
Please Wait while comments are loading...