twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేపాల్ భూకంపం: తెలుగు సినిమా యూనిట్ సభ్యులు ఏమైనట్లు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పొరుగుదేశం నేపాల్‌ను ఈ రోజు ఉదయం భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.9 గా నమోదైంది. ఈ భూకంపం దాటికి అక్క భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. నేపాల్ లోని పలు పలు చారిత్మక కట్టడాలు భూకంపం ధాటికి కూలిపోయాయి.

    నేపాల్ లో చాలా మంది తెలుగు వారు చిక్కుకు పోయారు. అక్కడ ఫోన్ నెట్వర్క్ పని చేయక పోవడంతో ఆచూకి తెలియడం లేదు. నేపాల్ లో చిక్కుకున్న వారిలో 'వెటకారం.కామ్' అనే తెలుగు చిత్రాకికి సంబంధించిన 20 మంది బృందం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఫోన్లు పని చేయక పోతుండటంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.

     Telugu people stuck in Nepal

    ‘వెంటకారం.కామ్' చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్న కుమారుడైన వీరేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగులో భాగంగా చిత్ర యూనిట్ నేపాల్ వెళ్లారు. అయితే ఎవరి ఫోన్లూ పని చేయడం లేదని, అక్కడ ఏమైందో తెలియక ఆందోళన చెందుతున్నామని, హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసినా సరైన సమచారం దొరకడం లేదని బంధువులు ఆందోళన చెందుతున్నారు. భూకంపం వచ్చిన సమయంలో వారు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయం కూడా తెలియడం లేదు.

    English summary
    A strong earthquake of magnitude 7.8 on Richter scale and a series of aftershocks struck Nepal on Saturday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X