»   » కేన్స్ చిత్రోత్సవాల్లో తెలుగు షార్ట్ ఫిలిం: హీరో రామ్ తమ్ముడి సినిమా

కేన్స్ చిత్రోత్సవాల్లో తెలుగు షార్ట్ ఫిలిం: హీరో రామ్ తమ్ముడి సినిమా

Posted by:
Subscribe to Filmibeat Telugu

ఈ చిత్రోత్సవాల్లో ఇప్పటికే మన భారతీయ నటీమణులు ఐశ్వర్యా రాయ్, మల్లికా శెరావత్, సోనమ్ కపూర్ మెరిశారు. ఐష్ నటించిన "సరబ్ జిత్" ప్రీమియర్ షో అక్కడ జరిగింది. కాగా, మన తెలుగు పరిశ్రమ నుంచి "బాహుబలి" స్క్రీనింగ్ కూడా జరగనున్న విషయం తెలిసిందే.

అలాగే, వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ గురించి దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ అక్కడ జరిగే చర్చా వేదికలో పాల్గొననున్నారు. కేన్స్ లో ప్రదర్శితమౌతున్న మొట్త మొదటి తెలుగు సినిమా బాహుబలి కావటం విశేషం...

అయితే.. ఇప్పుడు ఇంకో విభాగం లోనూ మనతెలుగు సినిమా పతాకం ఎగరనుంది. అక్కడి షార్ట్ ఫిలిం విభాగంలో మన తెలుగు కుర్రాడి సినిమా సెలక్ట్ అయ్యింది. ఎవరోకాదు తెలుగు సినిమా ప్రముఖ నిర్మాత "స్రవంతి రవికిశోర్" చిన్న తమ్ముడు డా. రమేశ్ బాబు కొడుకు, హీరో రామ్ కజిన్ బ్రదర్ రాజా నిషాంత్ సినిమానే అది.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. "60 ఎయిట్' పేరుతో స్వీయ దర్శకత్వంలో రాజా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రధానంగా ఎనిమిదేళ్ల కుర్రాడి చుట్టూ తిరిగే చిత్రం ఇది. 15 నిమిషాల నిడివి గల ఈ చిత్రం కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు అర్హత పొందడం మనకు గర్వకారణం. ఈ షార్ట్ ఫిలిం కి దర్శకత్వమే కాదు కథను కూడా దర్శకుడు రాజా పోతినేనినే ఇచ్చాడు.

ఎగిరిన తెలుగు సినిమా పతాక

 "60 ఎయిట్" ఒక చిన్న పిల్లవాడి చుట్టూ అల్లుకున్న కథ... కానీ పెద్ద రిజల్ట్ నే తీసుకువచ్చింది. దర్శకుడు రాజా పోతినేని ప్రతిభని ప్రపంచానికి చెప్పింది.

హీరో తమ్ముడే

ఈ చిత్ర దర్శకుడు ఎవరోకాదు నిర్మాత "స్రవంతి రవికిశోర్" చిన్న తమ్ముడు డా. రమేశ్ బాబు కొడుకు, హీరో రామ్ కజిన్ బ్రదర్ రాజా నిషాంత్ సినిమానే అది.

ఎనిమిదేళ్ల కుర్రాడి కథ

 "60 ఎయిట్' పేరుతో స్వీయ దర్శకత్వంలో రాజా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రధానంగా ఎనిమిదేళ్ల కుర్రాడి చుట్టూ తిరిగే చిత్రం ఇది.

తెలుగు కి అరుదైన గౌరవమే

 షార్ట్ ఫిల్మ్ విభాగం లో ఇప్పటి వరకూ వచ్చిన ఒకే ఒక తెలుగు సంతతి దర్శకుడి సినిమాఇదే.

స్వీయ కథ,దర్శకత్వం

ఈ షార్ట్ ఫిలిం కి దర్శకత్వమే కాదు కథను కూడా దర్శకుడు రాజా పోతినేనినే ఇచ్చాడు.

లోకల్ టాలెంట్ తోనే

 విదేశాల్లోనే స్థిరపడ్డ నిషాంత్ రాజా అక్కడి వాతావరణం లోనే, స్థానిక నటులతోనే సినిమా పూర్తి చేసాడు.

కథేమిటంటే


ఎనిమిదేళ్ల వయస్సులో జాన్‌ ప్రమాదానికి గురవుతాడు. దాంతో అతను 52 ఏళ్ల పాటు వయస్సుతో పాటు బుద్ధివికాసం చెందకుండా గడిపేస్తాడు. దాంతో జీవితమంతా ఘర్షణ పడుతాడు. స్థలకాలాల స్పృహ కూడా ఉండదు.

అకస్మాత్తుగా బాల్యంలోని స్నేహితురాలు ఎదురుపడుతుంది.

ఎనిమిదేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఆమె అతని బెస్ట్ ఫ్రెండ్. కథలో ఉన్న మలుపున్ అక్కడే ఉంది...

కేన్స్ చిత్రోత్సవాల్లో తెలుగు షార్ట్ ఫిలిం: హీరో రామ్ తమ్ముడి సినిమా

మానవసంబంధాల మీద అద్బుతమైన చిత్రీకరణ, ఈ షార్ట్ ఫిలిం ని పీక్స్ కి తీసుకు వెళ్ళింది. చాలమంది ప్రశంసలూ అందుకుంది.

English summary
Hero Ram cousines telugu short film to be screend at cannes film festival 2016
Please Wait while comments are loading...