twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖండించిన గణేష్: హైదరాబాద్‌లోనే జూ ఎన్టీఆర్ ‘టెంపర్’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ‘టెంపర్' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో కాకుండా గుంటూరులో లేదా నిమ్మకూరులో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ఇటీవల ఫిల్మ్ నగర్లో ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలను నిర్మాత బండ్ల గణేష్ ఖండించారు. ఈ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో అర్థం కాలేదన్నారు. హైదరాబాద్ లోనే ఆడియో వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. జనవరి 9న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

    కాగా...టెంపర్' చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ ఫోటోస్ విడుదలైనప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సిక్స్ ప్యాక్ బాడీతో ఎన్టీఆర్ గత సినిమాలకు భిన్నంగా కనిపిస్తున్నారు. పూరి జగన్నాథ్ తన సినిమాలో హీరోలను భిన్నంగా, తనదైన మార్కు కనిపించేలా స్టైలిష్‌గా చూపిస్తారు. తాజాగా ‘టెంపర్' చిత్రంలో తనదైన మార్కుతో జూ ఎన్టీఆర్‌ను ప్రజంట్ చేసాడు పూరి.

    ‘Temper’ audio launch in Hyderabad

    తాజాగా విడుదలైన జూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటోలు అభిమానులు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు.

    ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Producer Bandla Ganesh said that audio launch of Young Tiger NTR’s ‘Temper’ might take place in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X