Don't Miss!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీరూ ఓ లుక్కేయండి: ‘టెంపర్’ టైటిల్ సాంగ్ ట్రైలర్
హైదరాబాద్: యంగ్ టైగర్ నటించిన ‘టెంపర్' చిత్రం ఆడియో విడుదలై దుమ్ము రేపుతోంది. పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మరో వైపు ఈ చిత్రానికి ట్రైలర్ కూడా విడుదల చేసారు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ సినిమాలో ఏ రేంజిలో ఉంటుందో ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
‘టెంపర్' టైటిల్ సాంగుకు సంబంధించిన 39 సెకన్ల ట్రైలర్ కూడా విడుదల కూడా విడుదలైంది. సూపర్ స్పీడుగా ఎన్టీఆర్ వేసే స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. ఎన్టీఆర్ పవర్ ఫుల్ పెర్పార్మెన్స్, అదిరిపోయే డాన్సులు, ఫైట్లు, రొమాంటిక్ సీన్లతో కలిసి ఈ సినిమా ప్రేక్షకులు పూర్తి సంతృప్తి నిచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.
‘టెంపర్' ఆడియోతో పాటు....థియేట్రికల్ ట్రైలర్ అభిమానులను, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఎన్టీఆర్ గత చిత్రాలను బీట్ చేసే విధంగా ‘టెంపర్' ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 12 లేదా 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్ కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.