twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ లాయర్లు రేపిస్టులే: హీరోయిన్ అమలా పాల్ ఫైర్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మళయాలం హాట్ బ్యూటీ అమలా పాల్ ఆగ్రహంతో ఊగి పోయింది. వివాదాస్పద ‘ఇండియాస్ డాటర్' డాక్యుంటరీలో డిఫెన్స్ లాయర్స్ ఎకె సింగ్, ఎంఎల్ శర్మ చేసిన కామెంట్లపై ఆమె మండి పడింది. ఈ ఇద్దరు లాయర్లు నిర్భయను దారుణంగా రేప్ చేసి హత్య చేసిన నిందితుల తరుపున వాదిస్తున్నారు.

    నిర్భయ ఘనటపై బీబీసీ జర్నలిస్టు లెస్లీ ఉడ్విన్ తెరకెక్కించిన డాక్యుమెంటరీలో.... నిర్భయ నిందితులు, వారి లాయర్లు, వారి కుటుంబ సభ్యులు, బాధితురాలి తల్లిదండ్రుల అభిప్రాయాలు పొందు పరిచారు. నిందితుల తరుపున వాదిస్తున్న లాయర్లు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

    That lawyer is a rapist: Amala Paul

    నిందితులను వెనకేసుకొస్తూ...నిర్భయ ఆ సమయంలో బయటకు వెళ్లడాన్ని తప్పుగా వాదిస్తున్నారు. లాయర్ ఎమ్ఎల్ శర్మ మాట్లాడుతూ, బజారులో మిఠాయిలు పెడితే కుక్కలు ఎలా ఎగబడతాయో, సరైన రక్షణ లేకుండా బయట కనబడే అమ్మాయిలపై అత్యాచారాలు కూడా సహజమంటూ నిందితులను వెనకేసుకొచ్చారు. మరో లాయర్ మాట్లాడుతూ...మా కుటుంబంలో నాకూతురో, సోదరో రాత్రి పూట అలా తిరిగితే జుట్టు కత్తిరిస్తానంటూ వ్యాఖ్యానించారు.

    లాయర్ల తీరుపై అమలా పాల్ మండి పడింది. వీరు కూడా రేపిస్టుల్లానే కనబడుతున్నారంటూ మండిపడింది. మరో వైపు డిఫెన్స్ లాయర్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. మహిళకు రక్షణ లేకపోతే.. ఆమెపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారా.. అంటూ మండిపడుతున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దారుణంగా, నీచాతినీచంగా ఓ ఆడబిడ్డను పాడుచేసి పొట్టనబెట్టుకుని.. అదే ఆడబిడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అంటూ మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

    English summary
    The Malayali beauty Amala Paul is on fire. The actress is in no mood to pardon the cheap and highly regressive comments made by the two defence lawyers AK Singh and ML Sharma, in the controversial documentary film India's Daughter. The two lawyers have been fighting the case of the four convicted rapists in the gruesome Nirbhaya case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X