twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోరింగ్ సీన్లు తీసేసాం అంటూ...‘బ్రహ్మోత్సవం’ న్యూ పబ్లిసిటీ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి....అలాగే సినిమా కష్టాలు సినిమా వాళ్లవి! మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రహ్మోత్సవం' చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నష్టాలను వీలైనంత వరకు రికవరీ చేసుకునేందుకు వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు.

    'బోరింగ్ సీన్స్ తీసినందువల్ల చూడదగ్గ కుటుంబ కథా చిత్రం' అంటూ వార్తా పత్రికల్లో బ్రహ్మోత్సవం పబ్లిసిటీ సరికొత్తగా దర్శనమిస్తోంది. గతంలో ఏ సినిమాకు ఇలాంటి ప్రచారం నిర్వహించలేదు. మరి ఇలాంటి కొత్త పబ్లిసిటీ ట్రిక్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

    The new publicity trick: Watch Brahmotsavam, It's Not Boring

    'బ్రహ్మోత్సవం' సినిమా విడుదలైన రోజు నెగెటివ్ టాక్ రావడంతో సినిమాను చాలా వరకు ట్రిమ్ చేసారు. చాలా వరకు బోరింగ్ సీన్స్ తీసేసారు. అయినా సరే సినిమా నిలబడే పరిస్థితి లేదు. అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగి పోయింది. మౌత్ టాక్, సోషల్ మీడియా ద్వారా సినిమాపై తీవ్రమైన నెగెటివ్ ప్రచారం జరిగింది.

    Brahmostavam

    సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లందరూ దాదాపు సగం మేర నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాత నష్టరిహారం చెల్లింపులకు కూడా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు సినిమా ప్లాప్ అయినందుకు బాధ్యత తానే వహిస్తానని మహేష్ బాబు ప్రకటించడం గమనార్హం.

    English summary
    Brahmostavam film is into its second week and a paper ad in Kadapa proudly says "Boring scenes have been deleted, watch this wholesome family entertainer". This ad has obviously dismayed everyone since it comes from either the distributor or the exhibitor, who are not supposed to issue such ads.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X