twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా బావుంది మరి చిన్న సినిమా ఎలా బతకాలి...? ఒక దర్శకుడి ఆవేదన

    |

    భారత దేశ ప్రేక్షకులకు హాలీవుడ్ సినిమా కొత్త కాదు కొన్ని దశాబ్దాలనుంచీ విదేశీ చిత్రాలను భారత దేశ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.
    అయితే గత పదేళ్ళుగా భారత దేశం మీద హాలీవుడ్ సినిమాల విజృంబన మొదలయ్యింది గ్రాఫిక్స్, యానిమేశన్ చిత్రాలు యూరోపియన్ దేశాలతో సమంగా భారతీయ భాశలలోనూ డబ్ చేయబడి ఇక్కడ విడుదలౌతున్నాయి.

    ఇది ఒక రకంగా మంచి పరిణామమే అయినా ఇక్కడి పరిశ్రమల్లోని చిన్న సినిమాలని ధారుణం గా దెబ్బతీస్తోంది. ప్రతీ వేసవిలోనూ వచ్చే ఏదో ఒక హాలీవుడ్ చిన్న సినిమాలకు దొరికే కొద్దిపాటి కాలాన్ని కూడా థియేటర్లని అందకుండా చేస్తోంది. భారతీయ సినిమాలకు గట్టి పోటీనివ్వడమే కాదు.. నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై బాలీవుడ్‌ దర్శకుడు విక్రమ్‌ భట్‌ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.

    vikram

    "యానిమేషన్‌.. సైన్స్‌ఫిక్షన్‌.. యాక్షన్‌ చిత్రాలు మల్టీపెక్స్‌ థియేటర్లలో బాగా ఆడతాయని వారికి తెలుసు. అందుకే అలాంటి సినిమాలే ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు. ఇదేమీ తప్పు కాదు. వారికి నచ్చినట్టుగా సినిమాలు తీసి విడుదల చేయొచ్చు. కానీ.. అవి చిన్న సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పండగల సమయాల్లో అగ్రనటుల సినిమాలకు దీటుగా చిన్న సినిమాల్ని విడుదల చేయలేరు.

    కనీసం వేసవిలో విడుదల చేద్దామంటే.. సెలవుల్లో కుటుంబమంతా చూసే విధంగా హాలీవుడ్‌ యానిమేషన్‌.. సినిమాల్ని విడుదల చేస్తున్నారు. మిగతా రోజుల్లో విడుదల చేద్దామంటే.. క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. వాటి వల్ల సినిమాల్ని విడుదల చేయలేకపోతున్నారు. ఇలా అయితే చిన్న సినిమాలు చేసే దర్శకులు ఏమైపోవాలి? " అంటూ ఆయన చాలామంది చిన్న నిర్మాతలూ, దర్శకుల వేదనను పంచుకున్నారు.

    ఔను..! భారీ బడ్జెట్ తో ఒక బడా స్టార్ సినిమాని అది ఫ్లాప్ అయినా సరే ఇంకొన్ని రోజులు ఎదురు డబ్బులిచ్చి మరీ ఆడించుకుంటూ. అది తీసేయగానే మరో పెద్ద నిర్మాత ఆ థియేటర్ లో ఇంకోసినిమాకోసం రెడీ గా ఉంటాడు. వీళ్ళు తీసే సినిమాల్లో కేవలం కొద్దిపాటి ఎంటర్టైన్ మెంట్ తప్ప ఇంకేం ఉండదు. మన సినిమాల్లో "సృజనాత్మక కథలు తగ్గిపోతుందీ అనే సినీ పెద్దలు దీని మీద దృష్టి పెడితే బావుంటుందేమో...

    English summary
    then what about low budget indian movies..? says Vikram bhat who is meaker of Horroe story, Raaj, Heat Story1&2 etc
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X