twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది టీవీ9 జాఫర్ కాదట..., జూనియర్ ఎన్టీఆర్ పై ఎందుకింత పగ.. ఎవరు చేస్తున్నారు?? ఎందుకిలా చేస్తున్నారు

    |

    హీరోల మధ్య గొడవలు పైకి కనిపించటం లేదు కానీ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా అటు సినిమా పరం గానూ, ఇటు రాజకీయ పరం గానూ విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. ఒక ప్రముఖ టీవీ చానల్ జర్నలిస్ట్ వ్యతిరేకం అంటూ ప్రచారం చేయసాగారు. ఎవరు చేసారో ఇంకా తెలియలేదు కానీ ఆ జర్నలిస్ట్ పేరుతో ఫేక్ ట్విట్టర్ ఎకౌంట్ క్రియేట్ చేసి ఆ ఎకౌంట్‌ నుంచి ఎన్టీఆర్‌కు, జనతా గ్యారేజ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు.

    కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ను నమ్ముకుని ఎదురు చూస్తున్న వక్కంతం వంశీని దూరం పెట్తడం గురించీ, ఆయనతో పాటు పాటు ఈమధ్య జూనియర్ కు కథలు చెప్పడానికి ప్రయత్నించిన కొందరు యంగ్ దర్శకులను తన ఇంటిముందు గంటల కొద్ది వేచి ఉండేలా చూసి ఆ తరువాత వారి కథలను పూర్తిగా వినకుండా పంపించి వేసాడు అంటూ గాసిప్పులు కూడ బాగానే ప్రచారం చేసారు.

    There is A fake profile in twitter in the name of TV9 Jaffar

    టీవి 9 ఛానేల్ ని రెగ్యులర్ చూసే అలవాటు ఉంటే మీకు జాఫర్ అనే జర్నలిస్టు తెలిసే ఉండాలి. ఈ జాఫర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి, జనతా గ్యారేజ్ ఫేక్ కలెక్షన్లతో టాప్ 3 లోకి వచ్చింది, కర్ణాటకతోపాటు, అంధ్రప్రదేశ్ లోని కొన్ని ఏరియాల్లో బాగా ఫేక్ చేసారని ఓ ట్వీట్ కనబడింది. అంతేకాదు, ఇకపై ఎన్టీఅర్ సినిమాల కథలన్ని రాజమౌళి వింటారని, రాజమౌళికి వక్కంతం వంశీ కథ నచ్చలేదు కాబట్టే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందని మరో ట్వీట్ పడింది. ఎన్టీఆర్ పై ఇలా డైరెక్టుగా దాడి చేస్తున్నాడేంటి ఈ జర్నలిస్టు అని అందరు ఆశ్చర్యపోతుండగానే అసలు ట్విస్టు బయటపడింది. అది ఫేక్ అకౌంట్ అంట.

    "గమనిక : ట్విట్టర్ లో నా పేరు మీద ఎవరో ఫేక్ అకౌంట్ క్రియట్ చేసి ...వాళ్లకు పడని వారి పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ... అసలు ఈ అకౌంట్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు ...ఈమేరకు ట్విట్టర్ కు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది .... వాళ్ళు దర్యాప్తు మొదలు పెట్టారు ...అవకాశం ఉంటే మీరు కూడా ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లాలని -మనవి" అంటూ టీవి 9 జాఫర్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపారు.

    కర్నాటక, ఏపీల్లో జనతా వసూళ్లు చాలా తక్కువని, టాప్ మూవీల స్థానాల్లో జనతా మూడో స్థానానికి దిగజారిందని నెగటివ్‌గా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన సదరు జర్నలిస్ట్ తన పేరుతో ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడిందట. 'జనతా' సక్సెస్ చూసి ఓర్వలేని ఒక అగ్ర హీరో అభిమానులే ఇలా చేశారని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. తోటి హీరోపై చేసే ప్రచ్చన్న యుద్ధానికి జర్నలిస్ట్‌ను వాడుకోవడం అత్యంత నీచం అని చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో నిజానిజాలు ఇంకా బయటికి వెల్లడి కాకపోయినా, ఎన్టీఆర్ వ్యతిరేకులే ఇలా చేసి ఉంటారని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం సోషల్ నెట్‌వర్క్‌లో వైరల్‌గా ఉన్న ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

    English summary
    there is A fake profile in twitter in the name of TV9 Jaffar. used to give negative publicity about Jr NTR. jaffar complained about it. FB and Twitter will have a look on these activities and will take proper actions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X