twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాఫ్ అన్నారు...కానీ సునామీ కలెక్షన్స్...మెగా ఫ్యాన్స్ కు ధాంక్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినిమా హిట్, ఫ్లాఫ్ అనేది అంచనా వేయటం కష్టం.. అది తెలిస్తే అందరూ హిట్ సినిమాలే తీద్దురు...ఫ్లాఫ్ లు రావు అనేది అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని మెగా నిర్మాత అశ్వనీదత్ మరోసారి గుర్తు చేస్తున్నారు. కరెక్టుగా పాతికేళ్ల క్రితం తను నిర్మించిన చిత్రం రిలీజైనప్పుడు ఫ్లాఫ్ అన్నారు అని, తర్వాత అది సునామీ తరహా కలెక్షన్స్ తో దుమ్ము రేపిందని చెప్పుకొచ్చారు. ఆ సినిమా మరేదో కాదు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి '. ఈ రోజుతో రిలీజై పాతికేళ్లు పూర్తైన సందర్భంగా...ఆయన ఇలా స్పందించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అశ్వనీదత్ మాట్లాడుతూ..."రిలీజైన రోజు..ఆంధ్రాలో సైక్లోన్. అంతా మా సినిమా సూపర్ ఫ్లాప్ అన్నారు. అయితే కొద్దిరోజులు గడిచింది. సినిమా సునామీ తరహా కలెక్షన్స్ తో దుమ్ము రేపింది. ధాంక్స్ టు మెగా ఫాన్స్ ", అన్నారాయన. అలాగే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. డిజిటలైజ్ చేసి రీరిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

    “They Said Flop, But Its Tsunami” -Ashwini Dutt.

    మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్యూటీ శ్రీదేవి జంటగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి '. 1990 మే 9న విడుదలయిన ఈ చిత్రం తెలుగునాట ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విడుదలై 25 వసంతాలు పూర్తి చేసుకున్నా సినీ ప్రియుల మదిలో ఇంకా ఇది తాజా చిత్రంగానే మిగిలి ఉంది. తుఫాన్ ను సైతం లెక్కచేయకుండా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది.

    ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణులు ముఖ్యంగా చిత్ర ఛాయాగ్రాహకుడు అజయ్ విన్సెంట్, సంగీత దర్శకుడు ఇళయారాజా అందించిన పాటలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఈ చిత్రంలోని ఏడు పాటలూ శ్రోతలను బాగా అలరించాయి. ముఖ్యంగా అబ్బనీ తియ్యనీ దెబ్బ వంటి పాటలు ఇప్పటికీ ఆ పాటలు జనం నోళ్లలో నానుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

    స్టెప్పులతో చిరంజీవి అలరిస్తే దేవకన్యగా శ్రీదేవి, దుష్ట మాంత్రికుడుగా అమ్రిష్ పురి నటన ఈ చిత్రానికే హైలెట్. ఈ చిత్రానికి కురిసిన ప్రశంసల జల్లులో దర్శకుడు రాఘవేంద్రరావు తడిసి ముద్దయ్యారు. ఇక స్వర్గీయ జంధ్యాల రాసిన మాటలు ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయి.

    English summary
    “On the very day of release, as Andhra got hit with a devastating Cyclone everyone hinted me that “Jagadeka Veerudu Athiloka Sundari” is going to be Super flop. A couple of days later the film became major tsunami of collections. Thanks to Mega fans”, Said producer Ashwini Dutt.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X