twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాటమరాయుడు బెనిఫిట్ షో లు ఆగలేదు ఆపేసారు..., కారణం

    తమిళనాడు లాంటి పక్క రాష్ట్రాలలో కూడా వేసిన బెనిఫిట్ షోలు హైదరాబాద్ లో మాత్రం రద్దయ్యాయి. అవును తమిళనాడు లో ‘కాటమరాయుడు’ ఫ్యాన్స్ షోలు తెల్లవారజామునే మొదలయ్యాయి. పదుల సంఖ్యలో బెనిఫిట్ షోలు పడ్డాయి. కర

    |

    తమిళనాడు లాంటి పక్క రాష్ట్రాలలో కూడా వేసిన బెనిఫిట్ షోలు హైదరాబాద్ లో మాత్రం రద్దయ్యాయి. అవును తమిళనాడు లో 'కాటమరాయుడు' ఫ్యాన్స్ షోలు తెల్లవారజామునే మొదలయ్యాయి. పదుల సంఖ్యలో బెనిఫిట్ షోలు పడ్డాయి. కర్ణాటకలో నూ తెల్లారక ముందే చాలామంది సినిమా చూసేసారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే చిన్న చిన్న టౌన్లలో సైతం బెనిఫిట్ షోల మోత మోగింది. కానీ హైదరాబాద్ లో మాత్రం బెనిఫిట్ షో పడలేదు, అభిమానుల ఆశలమీద నీళ్ళు జల్లుతూ షోలని రద్దు చేసాం అన్న ప్రకటణ వెలువడింది. 'కాటమరాయుడు'కు మాత్రం ఒక్కటంటే ఒక్క షో కూడా వేయలేదు. ఊరించీ..ఊరించీ... ఉస్సూరనిపించారు. ఇంతకీ ఇలా రద్దు చేయటం వెనుక కారణం ఏమిటంటే

    ఊహించలేనంత గా పైరవీలు

    ఊహించలేనంత గా పైరవీలు

    ఒక అగ్ర హీరో సినిమా వస్తుందీ అంటే సినిమా కిముందు వచ్చే బెనిఫిట్ షోల మీదే అందరి దృష్టీ ఉంటుంది. తమ అభిమాన హీరో సినిమాని ముందే చూసేయాలన్న ఆతురత అభిమానుల్లో ఉంటుంది. అందుకే కొందరు హీరోల సినిమా బెనిఫిట్ షో టికెట్ల కోసం మనం ఊహించలేనంత గా పైరవీలు జరుగుతాయ్.

    టికెట్ ఖరీదు వేలల్లో

    టికెట్ ఖరీదు వేలల్లో

    100 రూపాయలకు మించని టికెట్ ఖరీదు వేలల్లో ఉంటుంది. ఇదే అదనుగా దొరికినంత దోహుకునే ముఠాలు తయారవుతాయ్. సాధారణ ప్రేక్షకుడు ఊహించలేడు గానీ ఈ బెనిఫిట్ షోల టికెట్ల అమ్మకం ఒక మాఫియా లా తయారయ్యింది. కొందరు హీరోల సినిమాలకి లక్షలు దాటి న దందా జరుగుతుంది. ఈ డబ్బంతా అనఫిషియల్ గానే చేతులు మారుతుంది.

    దోపిడీ అడ్డుకోవటానికే

    దోపిడీ అడ్డుకోవటానికే

    సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు కాటమరాయుడు సినిమాకి ఎదురయ్యింది. బెనిఫిట్ షోల కోసం గట్టిగానే ప్రయత్నాలు జరిగాయట, పైరవీలు కూడా మంత్రుల స్థాయిలో జరిగాయట కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే బెనిఫిట్ షోల పేరుతో జరుగుతున్న దోపిడీ దందాను అడ్డుకోవటానికే అని పోలీసుల సమాధానం.

     నిరాశపడ్డారు

    నిరాశపడ్డారు

    కాటమరాయుడు ఫిల్మ్ బెనిఫిట్ షో చూసేందుకు ఎగబడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మిడ్‌నైట్ షోలను తిలకించేందుకు హైదరాబాద్ నగరంలోని ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. దీంతో ధియేటర్స్ వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. కానీ షో రద్దైందని తెలిసి నిరాశపడ్డారు.

     హైదరాబాద్ లో

    హైదరాబాద్ లో

    ఏపీలో బెనిఫిట్ షోలు వేస్తారు కానీ.. టికెట్ల రేట్లు మరీ ఎక్కువ ఉండవు. దాదాపుగా అన్ని చోట్లా 500కు అటు ఇటుగా రేట్లు పెడతారు. మరీ డిమాండ్ ఎక్కువుంటే బాల్కనీ టికెట్ గరిష్టంగా రూ.1000 పెట్టి అమ్ముతారు. కానీ హైదరాబాద్ లో అలా కాదు. టికెట్ రేటు కనీసం వెయ్యి ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు మరీధారుణం. రూ.2000-3000 దాటినోతుంది ఖరీదు.

     పర్మిషన్ వచ్చేసిందంటూ

    పర్మిషన్ వచ్చేసిందంటూ

    నిన్న ‘కాటమరాయుడు' సినిమాకు పర్మిషన్ వచ్చేసిందంటూ ఒక థియేటర్లో బెనిఫిట్ షో కన్ఫమ్ చేసి.. రూ.3000.. రూ.2000.. రూ.1000 చొప్పున రేట్లతో టికెట్లు అమ్మకానికి పెట్టారు. అభిమానుల అత్యుత్సాహాన్ని సొమ్ము చేసుకుని లక్షలు లక్షలు సంపాదించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

    ఫిర్యాదులు రావడంతోనే

    ఫిర్యాదులు రావడంతోనే

    పైగా ఛారిటీ అంటూ దీనికో ముసుగు తొడుగుతారు. పోలీస్ పర్మిషన్ కోసం రూ.3 వేలు ఇచ్చేసి బెనిఫిట్ షోల పేరుతో దందాలు నడిపిస్తాయి ఈ గ్యాంగులు. దీనిపై చాలా ఫిర్యాదులు రావడంతోనే హైదరాబాద్ పోలీసులు వీటికి అడ్డుకట్ట వేయాలని డిసైడయ్యారు. అందుకే కొంత కాలంగా పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు వేయనివ్వట్లేదు.

    పోలీసులు వెనక్కి తగ్గలేదు

    పోలీసులు వెనక్కి తగ్గలేదు

    ‘కాటమరాయుడు' విషయంలో కొంచెం ఒత్తిడి ఎక్కువున్నా సరే.. పోలీసులు వెనక్కి తగ్గలేదు. అదండీ సంగతి అభిమాన సినీ హీరో సినిమా చూడాలని అందరికీ ఉంటుంది కానీ ఆ ముసుగులో జరిగే దోపిడీ ని అడ్డుకోవాలంటే పోలీసులు చేసిన పని సరైందేకదా

    English summary
    In a huge disappointment, the benefit shows of Pawan Kalyan's Katamarayudu have been cancelled in Hyderabad. Police have denied permission to the midnight shows of the film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X