twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీ రామారావు 21వ వర్ధంతి: మహా నటుడిని గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్!

    జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని పెంచిన నటుడు, నాయకుడు నందమూరి తారకరామారావు. ఈ రోజు ఆయన 21వ వర్ధంతి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ ఎన్టీఆర్ .

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని పెంచిన నటుడు, నాయకుడు నందమూరి తారకరామారావు. ఈ రోజు ఆయన 21వ వర్ధంతి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ మహా నటుడిని గుర్తు చేసుకుంటున్నారు.

    1923 మే 23న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన 320 కి పైగా చిత్రాల్లో నటించారు. 1949 లో 'మనదేశం' చిత్రంతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి వైవిధ్యవంతమైన పాత్రలు పోషించి తెలుగువారి అభిమానాన్ని చూరగొని 'నటరత్న' గా మన్ననలు పొందారు.

    పౌరాణిక పాత్రలు

    పౌరాణిక పాత్రలు

    ముఖ్యంగా పౌరాణిక పాత్రలు శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, దుర్యోధనుడు, భీష్ముడు, భీముడు, రావణాసురుడు ఇత్యాదులెన్నో అసమాన రీతిలో పోషించి పండిత పామరుల గుండెలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

    మాస్ హీరో

    మాస్ హీరో

    'పాతాల భైరవి', 'మిస్సమ్మ', 'మాయా బజార్', 'గుండమ్మ కథ', 'రాముడు భీముడు', దాన వీర శూర కర్ణ', 'బొబ్బిలి పులి', 'వేటగాడు' ఇవే కాక ఇంకా చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన సాధించారు. ఆయన తన అధ్బుత నటనతో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

    రాజకీయ ప్రభంజనం

    రాజకీయ ప్రభంజనం

    1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాలలో రాష్ట్రం నాలుగు చెరగులా పర్యటించి ప్రజాభిమానంతో ఎన్నికల పోరాటంలో అఖండ విజయం సాధించి రికార్డు సృష్టించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. తెలుగు భాషాభివృద్ధికి తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించారు.

    తెలుగు జాతి ఆణిముత్యం

    తెలుగు జాతి ఆణిముత్యం

    తెలుగువారి కీర్తి నలుదెసల్ వెదజల్లి తెలుగు రుచులనెల్ల తెలియజెప్పి కీర్తిఘనుడు యెక్కె గిన్నీసు బుక్కుల అతనికతడెసాటి అక్కిరాజ తెలుగు జాతికతడు తెచ్చిన ఖ్యాతి తో అయ్యె శాశ్వతుండు అవనిమీద అపరవిక్రమార్కుడన చెల్లునాతని అతని కతడె సాటి.... అంటూ ఆ మహానుభావుడి గురించి గొప్పగా చెబుతుంటారు.

    చివరి రోజుల్లో

    చివరి రోజుల్లో

    అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ చివర రోజుల్లో అప్పటి పరిస్థితుల ప్రభావంతో తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురై జనవరి 18, 1996న కన్నుమూసారు.

    English summary
    Today Sr NTR 21st death anniversary. Nandamuri Taraka Rama Rao (28 May 1923 – 18 January 1996), popularly known as NTR, was an Indian actor, filmmaker and politician who served as Chief Minister of Andhra Pradesh for seven years over three terms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X