twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లంచం: దొరికిపోయిన టాలీవుడ్ సెన్సార్ బోర్డు అధికారి (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమాలకు సెన్సార్ సర్టిపికెట్ జారీ చేసే అధికారి శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ‘అందాల చందమామ' అనే సినిమా ‘యూ' సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారి శ్రీనివాసరావు రూ. లక్ష డిమాండ్ చేసారు. దీంతో ఆ చిత్ర నిర్మాత ప్రసాద్ రెడ్డి సీబీఐని ఆశ్రయించారు.

    నిర్మాత ప్రసాద్ రెడ్డి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు టాలీవుడ్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి నిర్మాత వద్ద నుండి శుక్రవారం రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెండ్ హాండెడ్ గా పట్టుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో సెన్సార్ బోర్డు అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి సినిమాలకు ఇచ్చే సర్టిఫికెట్ల విషయంలో కూడా అవినీతి రాజ్యమేలుతుందనే విషయం స్పష్టమవుతోంది.

    మధులగ్న దాస్, ఐశ్వర్య, రమన్ లాల్ ప్రధాన పాత్రల్లో కె.ఎస్.మూర్తి దర్శకత్వంలో పి.డి.ఆర్.ప్రసాద్ రెడ్డి నిర్మించిన సినిమా 'అందాల చందమామ'. ఓ మహిళకు అన్యాయం జరిగినప్పుడు భయపడకుండా దైర్యంగా ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించామని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

    అధికారి ఇతడే

    అధికారి ఇతడే


    నిర్మాత నుండి లంచం తీసుకుంటూ పట్టుబడిన సెన్సార్ బోర్డు రిజనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు.

    సిబీఐ అధికారులు

    సిబీఐ అధికారులు


    శ్రీనివాసరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సీబీఐ అధికారులు.

    శ్రీనివాసరావు

    శ్రీనివాసరావు


    కార్యాలయం బయట సెన్సార్ బోర్డు అధికారి శ్రీనివాసరావు బోర్డు.

    కార్యాలయం

    కార్యాలయం


    హైదరాబాదులోని సెన్సార్ బోర్డు కార్యాలయం

    English summary
    Tollywood Censor Board officer Srinivasa Rao Caught by CBI. According to reports, the Censor Board officer demanded Rs 1 Lakh as bribe from Andala Chandamama producer Prasad Reddy to issue clean U certificate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X