twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శక,నిర్మాత,నటుడు డి.రంగారావు మృతి

    By Srikanya
    |

    హైదరాబాద్ : హిట్, ఫ్లాపులకు సంభంధం లేకుండా వరసగా సినిమాలు నిర్మిస్తూ...కేవలం తొమ్మిదేళ్ల కాలంలో 55 చిత్రాలను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన దోసపాటి రంగారావు (57) గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు. ఆయన సినిమాలు దర్శకత్వం వహించి, నిర్మించటమే కాకుండా నటిస్తూండేవారు కూడా.

    Tollywood Director D Ranga rao Died

    డి. రంగారావుగా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితమైన ఆయన డైరెక్ట్‌ చేసిన చిత్రాల్లో కృష్ణతో చేసిన ‘సీబీఐ ఆఫీసర్‌' కూడా ఉంది. అలాగే ఆయన తెలుగులోనే కాకుండా ‘ప్రేమి' అనే హిందీ సినిమాని కూడా రూపొందించారు.

    వరంగల్‌లో జన్మించిన రంగారావు సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్‌ వచ్చి అయ్యప్ప ఆర్ట్స్‌ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పి, 2000లో మొట్టమొదటగా సొంత డైరెక్షన్‌లో తక్కువ బడ్జెట్‌తో, అతి తక్కువ సమయంలో ‘ఐ డోంట్‌ కేర్‌' అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత తనే నిర్మాత, దర్శకునిగా ‘భయం', ‘అంతా ఒక మాయ', ‘బెండుతీస్తా', ‘మిస్టరీ', ‘ప్రియాంక' తదితర యాభై చిత్రాలు తీశారు. ఆయన చివరి చిత్రం 2009లో వచ్చిన ‘ప్రేమి.. నాటీ బాయ్‌'.

    English summary
    Telugu Film director and Producer D Ranga Rao died with Heart stroke.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X