twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనమే నెం.1

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ సినీ పరిశ్రమకు నెం.1 స్థానం దక్కింది. 2013-2014 సంవత్సరానికి గాను అత్యధికంగా సినిమాలు ప్రొడ్యూస్ చేసిన పరిశ్రమగా తెలుగు చిత్ర పరిశ్రమ నిలిచింది. ఇప్పటి వరకు ఈ విషయంలో బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలు మొదటి స్థానంలో ఉండేవి.

    2013-2014 సంవత్సరానికి గాను మొత్తం ఇండియా నుండి 1966 సినిమాలు ప్రొడ్యూస్ కాగా....అందులో 349 సినిమాలు తెలుగు సినిమాలే కావడం విశేషం. గత సంవత్సరం తమిళ సినిమాలు అత్యధికంగా ఉండి నెం.1 స్థానం దక్కించుకోగా 2013-2014 సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమ ఆధిపత్యం ప్రదర్శించింది.

    Tollywood Is No.1

    పేరుకు 349 సినిమాలు అని చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నా...అందులో చాలా సినిమాలు ప్లాపయ్యాయి. హిట్టయి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలు వేళ్లపై లెక్కించదగ్గ కొన్ని మాత్రమే ఉన్నాయి. ప్రభాస్ నటించిన మిర్చి, పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారంటికి దారేది', అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం', మహేష్-వెంకీ మల్టీ స్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి కొన్ని చిత్రాలు చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి.

    లాభ నష్టాల సంగతి ఎలా ఉన్నా...తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక సినిమాలు నిర్మాణం అవ్వడం ఆనందించ దగ్గ విషయమే. దీని వల్ల ఎంతో మందికి ఉపాది కలుగుతోంది. సినిమాల సంఖ్యతో పాటు విజయాల శాతం కూడా పెరిగితే పరిశ్రమ పచ్చగా కళకళలాడుతుంది.

    English summary
    Tollywood has been rated first in the list of film industries producing most number of films in the year 2013-2014. It has broken the records of Kollywood and Bollywood. Of the 1966 movies released across the globe, 349 are Telugu movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X